ఆమెను మళ్లీ కలవాలనుంది!

Vishakapatnam BOy Naveen Waiting For a Girl. - Sakshi

హాయ్‌ ఫ్రెండ్స్‌... నా పేరు నవీన్‌. మాది విశాఖపట్నం. 2019 దీపావళి రోజు నేను మామూలుగానే మాకు దగ్గరలో ఉండే స్పెన్సర్‌కు కొన్ని వస్తువులు కొనడానికి వెళ్లాను. ఆ షాప్‌ రామాటాకీస్‌ రోడ్డులో ఉంది. నేను నాకు కావలసిన వస్తువుల కోసం వెతుకుతున్న టైంలో వెజిటెబుల్స్‌ బ్లాక్‌లో నాకు ఒక ఐఫోన్‌ కనిపించింది. నేను ఎవరో మర్చిపోయారు పాపం దీని కోసం కంగారు పడతారు అనుకొని నా దగ్గరే ఉంచుకున్నాను. తరవాత 10 నిమిషాలకు ఒకరు ఆ ఫోన్‌కు కాల్‌ చేశారు.

ఆమె పేరు నిహా. ఆమె అది తన ఫోన్‌ అని మర్చిపోయాను అని చెప్పింది. నేను 7వ నెంబర్‌ బిల్లింగ్‌ కౌంటర్‌ దగ్గర ఉన్నాను అని చెప్పాను. తను వాళ్ల ఫ్రెండ్‌ ఒకతనితో కలసి వచ్చింది. నేను ఆమెకు ఫోన్‌ ఇచ్చాను. వాళ్లు నాకు చాక్లెట్‌ ఇవ్వబోయారు. నేను తీసుకోలేదు. దాని తరువాత నుంచి నేను ఆమెను మర్చిపోలేకపోతున్నాను. ఇప్పటికి ఆమె నాకు గుర్తుంది. ఇది చదివిన తరువాత ఆమె నాతో  మాట్లాడుతుంది అనుకుంటున్నాను.
ఆమె నన్ను కలవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్‌ టు ‘సాక్షి’. 

నవీన్‌(విశాఖపట్నం).

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top