నీకెందుకని తనని తిట్టేశాను!

Vinay From Karnool: Success Love Story - Sakshi

నా పేరు వినయ్‌. నాది చాలా హ్యాపీ లైఫ్‌. అన్ని ఉన్నాయి నాకు. మంచి అమ్మనాన్న, అల్లరి చేసే చెల్లి, ప్రేమగా చూసుకునే నాన్నమ్మ, తాతయ్య అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. చాలా ఆనందంగా ఉండేది మా లైఫ్‌. అంతా మంచిగా ఉంటుంది అనుకున్న సమయంలో మా అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. అంతా ఒక్కసారిగా తలకిందులై పోయింది. మా ఇంట్లో నవ్వులు మాయమయ్యాయి. మా నాన్న ఇష్టం లేకపోయిన రెండో పెళ్లి చేసుకోవల్సి వచ్చింది. మా చెల్లి చాలా చిన్నపిల్ల. తనకోసమే మా నాన్న మా పిన్నిని చేసుకున్నారు. ఇంకా మాకు కష్టాలు మొదలయ్యాయి. రోజు ఏదో ఒక గొడవ. ఇంట్లో ఉండాలంటేనే చిరాకు వేసేది. 

నేను ఇంటర్‌ అయిపోయి బీటెక్‌లో జాయిన్‌ అయ్యాను. ఎవ్వరితో మాట్లాడేవాడిని కాదు. చాలా సైలెంట్‌గా ఉండేవాడ్ని. అప్పుడే నా లైఫ్‌లోకి నందు వచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ పక్క వారిని నవ్విస్తూ ఉండేది. తను నా దగ్గరకు కూడా వచ్చి ఎందుకు బాబు ఎప్పుడు మొహం ఉమ్‌మ్‌...అని పెట్టుకొని ఉంటావు అంది. నాకు కోపం వచ్చి నువ్వు ఎవరివే నన్ను అడగడానికి పో ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచాను. అంతే తన కంట్లో నుంచి నీళ్లు ధారలా కారిపోయాయి. తను ఎప్పుడు ఏడవడం నేను చూడలేదు. నాకే చాలా బాధ వేసింది. తరువాత కొద్దిసేపటికి నేనే వెళ్లి సారీ చెప్పాను. నందు చాలా మంచిది వెంటనే క్షమించేసింది. అప్పటి నుంచి తనతో మాట్లాడటం మొదలు పెట్టాను. 

చాలా చక్కగా మాట్లాడేది. మా ఇంట్లో విషయాలు తనతో చెప్పాను చాలా బాధపడింది. నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. నా కోసం స్పెషల్‌గా బాక్స్‌ తెచ్చేది. మేమిద్దరం చాలా క్లోజ్‌ అయిపోయాం. మళ్లీ నా లైఫ్‌లోకి హ్యాపీ డేస్‌ వచ్చాయి అనిపించింది. తను లేకుండా నేను ఉండలేకపోయేవాడ్ని. అందుకే తనకు ఒకరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లైఫ్‌ లాంగ్‌ మా అమ్మను ఎంత ప్రేమిస్తానో అంత ప్రేమిస్తాను అని చెప్పాను. తను కూడా ఒక వారం టైం తీసుకొని మా ఇంట్లో ఒప్పిస్తే పెళ్లి చేసుకుంటాను అంది. మా ఇద్దరి కాస్ట్‌లు వేరు. అయినా నేను చదువు అయిపోయిన వెంటనే మంచి జాబ్‌ తెచ్చుకొని వాళ్ల ఇంట్లో ఒప్పించాను. మా నా జీవితంలోకి సంతోషం వచ్చింది. నందు, నేను, మా చెల్లి ముగ్గురం కలిసి ఉంటున్నాం. మా చెల్లిని కూడా నందు అమ్మలా చూసుకుంటుంది. నా నందు దొరకడం నా అదృష్టం. ఐ లవ్‌ యూ సో మచ్‌ నందు. 
వినయ్‌
కర్నూలు.

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top