ఆమె ప్రేమ ముందు నేను ఓడిపోయా!

Love Stories In Telugu : Ravi Kishore Happy Ending Love, Hyderabad - Sakshi

ఒక లవ్‌ ఫేయిల్యూర్‌ తర్వాత హైదరాబాద్‌లో జాబ్‌లో జాయిన్‌ అయ్యాను. తర్వాత మా ఫ్రెండ్‌ ద్వారా నాకు ఒక అమ్మాయితో పరిచయం అయ్యింది. అలా మా పరిచయం కాస్తా ప్రేమగా మారింది. బాగా డీప్‌ లవ్‌లో ఉన్నాం. చెప్పిన పని చేయకపోతే నాకు కొద్దిగా కోపం వస్తుంది. నాకు అమ్మాయి జాబ్‌ చేయాలని కోరుకునేవాడిని! ఫైనాన్షియల్‌ సపోర్ట్‌ కోసం. జాబ్‌ ట్రై చెయ్యమని చాలా సార్లు చెప్పాను. ప్రతి మూడు నెలలకు , నాలుగు నెలలకు జాబ్‌ మానేస్తుండేది. ఒక జాబ్‌లో స్టాండర్డ్‌గా ఉండమని చాలాసార్లు ఆమెకు చెప్పాను. కానీ, ఆ అమ్మాయి ఉండలేదు. నాకు కోపం వచ్చింది. మనం పెళ్లి చేసుకుంటే ఒక శాలరీతో ఎలా బ్రతకాలి అని ఎన్నో సార్లు చెప్పాను. కానీ, తను మారలేదు. నాకు కోపం వచ్చి లవ్‌ బ్రేకప్‌ చేద్దాం అని చెప్పాను. ఆ అమ్మాయి ప్రేమ ముందు నేను ఓడిపోయాను. నేను అడ్జస్ట్‌ చేసుకుని పెళ్లి చేసుకున్నా. మొదటి సంవత్సరంలో ఫైనాన్షియల్‌గా ఎన్నో ప్రాబ్లమ్స్‌.

తనకు జాబ్‌ చేయటం ఇష్టంలేదని చెప్పేసింది. చాలా గొడవలు అయ్యాయి. చాలా బాధపడ్డా. జాబ్‌ చేయకపోవటం తప్ప తనలో ఏ తప్పు కనబడలేదు. ఓ ఇంటి ఇల్లాలుకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆమెలో ఉన్నాయి. నేను అర్థం చేసుకున్నా! డబ్బు ఒక్కటే కాదు, లైఫ్‌లో అన్నీ ఉండాలని. సో నేను మంచి జాబ్‌ ట్రై చేసి, ఓ మంచి కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉన్నా. ఇప్పుడు ఫైనాన్షియల్‌గా అన్నీ క్లియర్‌ అయ్యాయి. మనం మనకోసం కాకుండా ఎదుటి వ్యక్తికోసం కూడా ఆలోచించడమే జీవితం. థాంక్స్‌ లడ్డు.. హనీ!
- రవికిషోర్‌, హైదరాబాద్‌

చదవండి : ఆ కుటుంబం నన్ను నాశనం చేసింది
అది ఈ జనరేషన్‌కు బాగా అలవాటు!



లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top