మా పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారా? | Hindu Muslim 'Telugu' Love Marriage Stories From Hyderabad | Sakshi
Sakshi News home page

మా పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారా?

Nov 15 2019 10:30 AM | Updated on Nov 15 2019 10:36 AM

Hindu Muslim 'Telugu' Love Marriage Stories From Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నేను డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఉన్న టైమ్‌లో మా ఇంటికి దగ్గరగా ఉన్న ముస్లిం అమ్మాయితో స్నేహం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత మా స్నేహం మరింత బలపడింది. ఓ రోజు ఇద్దరం కలిసి మాట్లాడుకుంటుండగా ఆమెకు బాగా దగ్గరైన భావన కల్గింది నాలో. వెంటనే ఆలస్యం చెయ్యకుండా ఆమెకు నా ప్రేమను తెలియజేశా. నా మీద ఆమెకు ఎలాంటి ఫీలింగ్స్‌ ఉన్నాయో ఆలోచించకుండా ప్రపోజ్‌ చేశా. తర్వాత తను ఏం సమాధానం చెబుతుందో తెలియక చాలా టెన్షన్‌గా ఉండింది. ఒక గంటన్నర పాటు ఆమె సమాధానం కోసం ఆత్రుతగా ఎదురు చూశా. తను ‘లవ్ యూ టు’ అని సమాధానం ఇచ్చింది. ఇంత వరకు బాగానే ఉంది.. ఆ తర్వాత మాకు అసలు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే? మా ఇద్దరివీ వేరు వేరు కులాలు, మతాలు. నేను హిందూ ఆమె ముస్లిం. నేను ఆమె మతంలోకి మారితే వాళ్ల వాళ్లు ఒప్పుకుంటారు. కానీ, మతం మారడానికి మా వాళ్లు కచ్చితంగా ఒప్పుకోరు. మా ఇంట్లో నేను, మా చెల్లెలు మాత్రమే. 

అలా మా ఆలోచనలతో మా ఇద్దరి ప్రేమ ఒక సంవత్సరం పూర్తిచేసుకుంది. ఇంకో మూడు, నాలుగు సంవత్సరాల్లో మేము స్థిరపడిపోతాము. కానీ, మా పెళ్లికి మా ఇద్దరి పెద్దలు ఒప్పుకుంటారా అన్న దిగులు మొదలవుతోంది. మా పెళ్లి ఎలా జరుగుతుందో, ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అన్న భయం. మేమిద్దరం ఎప్పుడు కలిసినా ఇదే విషయం మీద మాట్లాడుకోవడం మామూలైపోయింది. కానీ, ఇప్పుడు మాత్రం మేమిద్దరం మంచి ఉద్యోగం కోసం కోచింగ్‌లో ఉన్నాము. మంచి ఉద్యోగం వచ్చిన తరువాత మా ప్రేమ విషయం మా పెద్దలకు తేలియజేయాలనుకుంటూన్నాము.
- విను, హైదరాబాద్‌
చదవండి : మాటలతో మనిషిని మార్చేసే టెక్నిక్ ఆమె సొంతం
తెలిసీ తెలియని వయసులో అలా చేశా..


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement