మాటలతో మనిషిని మార్చేసే టెక్నిక్ ఆమె సొంతం

Facebook Love Story in Telugu, Srinadh Breakup Love Story From Ongole - Sakshi

నేను నా పనేదో చేసుకుంటూ.. అప్పుడప్పుడు ఫేస్‌బుక్‌ గ్రూప్‌లో పోస్టులు పెడుతూ ఉండేవాడిని. ఓ సారి ఎవరో ఒక అమ్మాయి ‘హాయ్‌’ అని మెసేజ్ పెట్టింది. నేను పట్టించుకోలేదు. రెండోసారి కూడా ‘హాయ్‌’ అని మెసేజ్‌ పెట్టింది. సర్లే ఎవరో తెలుసుకుందాం అని నేను కూడా రిప్లై పెట్టా. ఇక అంతే అక్కడి నుండి స్టోరీ ఎక్కడికో వెళ్లిపోయింది. మొదట్లో బాగానే మాట్లాడుకునే వాళ్లం. మా పరిచయం కూడా ఎక్కడికో వెళ్లింది. తను ఫ్రోఫైల్ పిక్ పెట్టలేదు కానీ, నా ఫ్రొఫైల్ మొత్తం చూసింది. నా ఫొటోస్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంది. ఎందుకో తెలియలేదు. ఆమె వాయిస్ సూపర్‌గా ఉంటుంది. అచ్చం జెస్సి వాయిస్ లాగా. ఆటిట్యూడ్ కూడా సూపర్. మాటలతో మనిషిని మార్చేసే టెక్నిక్ ఆమె సొంతం. మొత్తానికి ఆమె క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. కొన్ని రోజులు బాగానే మాట్లాడింది. ఇక నేను ఆగలేక ప్రపోస్‌ చేశా. ప్రపోజ్‌ చేసిన తర్వాత చాలా సార్లు గొడవలు అయ్యాయి. విడిపోదాం అని నేనే అన్నాను కానీ, ఆమె అసలు అనలేదు. ఎందుకో అర్ధం కాలేదు.

‘నేను రిలేషన్‌ని వదులుకోను.. నువ్వు వదులుకుంటావేమో’ అని అంది. ఆ పరిస్థితుల్లో కూడా బాగా నచ్చింది. ‘నువ్వు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు! మనం పెళ్లి చేసుకుందాం’ అని అడిగా. అప్పుడప్పుడు గొడవ పడుతున్నా తర్వాత నేను కూల్‌ అయ్యి సారీ చెప్పేవాడిని. అపుడు తను అసలు మెసేజ్ చేసేది కాదు. ‘ఎందుకు?’ అని అడిగితే.. ‘నేను గొడవ పెంచాలనుకోవడం లేదు’ అని అంటుంది. ఇలా కొన్ని రోజులు అయిపోయాయి. ఓసారి కలుద్దాం అని అనుకున్నాం. తనే డేట్‌ ఫిక్స్ చేసింది. ఎందుకు ఆ రోజు అంటే, ఆ రోజు మంచి రోజు అని అంది. సరే ఆ రోజే కలుద్దాం అనుకున్నాం. ‘నీకు కోపం ఎక్కువ అప్పటి లోపు కోపం తగ్గించుకో’ అంది. అస్సలు కోపం తెచ్చుకోను అని చెప్పి చాలా సార్లు కోపడ్డా ఆమె మీద. అయినా సరే ఎప్పుడు కూడా మాట్లాడం మానేయలేదు. చాలా మంది నాతో చెప్పారు ‘ఫేస్‌బుక్‌ అమ్మాయిల్ని నమ్మవద్దు’ అని. నేను కూడా అదే కరెక్ట్ అని అనుకున్నా. ఎందుకంటే ఆమె వివరాల గురించి అడిగినపుడు ఏమీ చెప్పలేదు. ‘ఇంకా టైం ఉంది తర్వాత చెప్తా’ అని అంది.

అప్పుడు ఒకసారి అనుమానం వచ్చింది. నేను ఏదైనా ముఖం మీదే అడిగేస్తా. అలానే ఆమెని కూడా అడిగేశా. ఆమె చాలా హర్ట్ అయింది! బాధ పడుతూ చెప్పింది. ‘ఒక రోజు ఫిక్స్ చేసుకున్నాం కదా! ఆ రోజు అన్ని వివరాలు చెప్తా’ అని అంది. సరే ఇక నేను కూడా అలాగే అని చెప్పి ఊరుకున్నా. నేను చాలా సార్లు ఆమెని ‘నువ్వు నన్ను మోసం చేసావ్' అని అన్నాను. అందుకు ఆమె చాలా బాధ పడింది. కానీ నన్ను వదిలేద్దాం అని ఎప్పుడూ అనుకోలేదు. తనను అర్థం చేసుకున్నా. కానీ, తన కోసం ఎన్ని రోజులు ఆగాలో మాత్రం అర్ధం కాలేదు. నువ్వు మా అమ్మ కన్నా ఎక్కువ అని చెప్పా. అర్థం చేసుకుంటాది అని అనుకున్నా. నేను చెప్పేది నిజం కాదు అనుకుంది. సడెన్‌గా ఒకరోజు ‘మా అమ్మకి బాగోలేదు. సీరియస్‌గా ఉంది. చెన్నై తీసుకువెళ్లాలి’ అని అంది. ‘చెన్నై వెళ్తే నన్ను మరచిపోతావా?’ అని అడిగింది. ‘నేను నిన్నెపుడూ మర్చిపోను.. ముందు ఆంటీకి బాగుండాలి. దైర్యంగా వెళ్లు’ అని చెప్పాను. ఆమె చెన్నై వెళ్లింది. కానీ ఇప్పటివరకు మెసేజ్ కానీ, ఫోన్ కాల్ గానీ లేదు. అక్కడ పరిస్థితి ఏంటో నాకు తెలీదు.

ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఫేస్‌బుక్‌లో రోజూ ఆన్‌లైన్‌లోనే ఉంటుంది కానీ, నాకు రిప్లై ఇవ్వడం లేదు. నా ప్రేమ తనకి అర్ధం కాలేదని తెలుసుకున్నా. ఇచ్చిన మాట ప్రకారం నేను గుడికి వెళ్లా. ఆ గుడిలో పూజారిని అడిగా! నా కథ మొత్తం చెప్పా. అమ్మవారి మీద ప్రామిస్ చేసింది. తప్పకుండా వస్తా అంది. కానీ, రాలేదు. అపుడు పంతులు గారు ‘అమ్మ వారితో ఆటలాడితే ఫలితం విపరీతంగా ఉంటుంది. నువ్వు అమ్మ వారిని నమ్ముకున్నావ్ కదా! అమ్మ వారు నీకు మంచి చేస్తుంది’ అని అన్నారు. ‘విజయవాడ నుండి ఒంగోలు వచ్చి వేస్ట్ అయింది’ అని గుడి మెట్లు దిగుతుంటే నాకు ఒక కాల్ వచ్చింది. నా ఫ్రెండ్ చనిపోయాడని. వాడు కూడా అమ్మ వారి మీద ప్రామిస్ చేసి తన లవర్‌ని వదలను అని చెప్పాడు. కానీ మోసం చేశాడు. అమ్మ వారు వెంటనే ఫలితం చూపించింది. ఇక మనసులో నేను ' నువ్వు ఉన్నావు తల్లి' అని అనుకుంటూ తిరిగి మా ఇంటికి వచ్చేశా.
- శ్రీనాథ్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top