ఢిల్లీలో మహాత్ముడు కాలుమోపి వందేళ్లు | When Gandhiji first visited Delhi, 100 years back | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మహాత్ముడు కాలుమోపి వందేళ్లు

Apr 13 2015 1:18 AM | Updated on Sep 3 2017 12:13 AM

1915లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో మిత్రులతో కలసి తీయించుకున్న ఫొటోలో మహాత్మాగాంధీ దంపతులు (వృత్తంలో)

1915లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో మిత్రులతో కలసి తీయించుకున్న ఫొటోలో మహాత్మాగాంధీ దంపతులు (వృత్తంలో)

జాతిపిత మహాత్మా గాంధీ మొట్ట మొదటిసారిగా ఢిల్లీలో అడుగుపెట్టి సరిగ్గా...

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ మొట్ట మొదటిసారిగా ఢిల్లీలో అడుగుపెట్టి సరిగ్గా ఆదివారానికిత వందేళ్లు పూర్తయింది. దక్షిణాఫ్రికా నుంచి 1915 జనవరి 9న భారత్‌కు తిరిగి వచ్చిన గాంధీ ఏప్రిల్ 12న భార్య కస్తూర్బాతోపాటు కొంతమంది సన్నిహితులతో కలసి ఢిల్లీలో అడుగు పెట్టారు.  దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తరువాత తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకు గాంధీ దేశపర్యటన ప్రారంభించారు. దేశంలోని సాధారణ ప్రజల జీవన పరిస్థితులు పరిశీలించడంతో పాటు...

 రాజకీయపోరాటం ప్రారంభించడానికి ప్రజల సన్నద్ధతను అంచనావేయడమే ఆయన పర్యటన ముఖ్యోద్దేశం. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో రెండురోజులు గడిపిన మహాత్ముడు కుతుబ్‌మినార్, ఎర్రకోట, సెయింట్ స్టీఫెన్ కాలేజీతోపాటు సంగం థియేటర్‌ను సందర్శించినట్లు రికార్డులు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement