ఢిల్లీలో మహాత్ముడు కాలుమోపి వందేళ్లు
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ మొట్ట మొదటిసారిగా ఢిల్లీలో అడుగుపెట్టి సరిగ్గా ఆదివారానికిత వందేళ్లు పూర్తయింది. దక్షిణాఫ్రికా నుంచి 1915 జనవరి 9న భారత్‌కు తిరిగి వచ్చిన గాంధీ ఏప్రిల్ 12న భార్య కస్తూర్బాతోపాటు కొంతమంది సన్నిహితులతో కలసి ఢిల్లీలో అడుగు పెట్టారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తరువాత తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకు గాంధీ దేశపర్యటన ప్రారంభించారు. దేశంలోని సాధారణ ప్రజల జీవన పరిస్థితులు పరిశీలించడంతో పాటు...
రాజకీయపోరాటం ప్రారంభించడానికి ప్రజల సన్నద్ధతను అంచనావేయడమే ఆయన పర్యటన ముఖ్యోద్దేశం. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో రెండురోజులు గడిపిన మహాత్ముడు కుతుబ్‌మినార్, ఎర్రకోట, సెయింట్ స్టీఫెన్ కాలేజీతోపాటు సంగం థియేటర్‌ను సందర్శించినట్లు రికార్డులు చెబుతున్నాయి.