కన్నీళ్లు పెట్టుకున్న థాయ్‌లాండ్ ప్రధాని | Thailand Prime Minister breaks down in tears | Sakshi
Sakshi News home page

కన్నీళ్లు పెట్టుకున్న థాయ్‌లాండ్ ప్రధాని

Dec 11 2013 1:08 AM | Updated on Sep 2 2017 1:27 AM

కన్నీళ్లు పెట్టుకున్న థాయ్‌లాండ్ ప్రధాని

కన్నీళ్లు పెట్టుకున్న థాయ్‌లాండ్ ప్రధాని

థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ఇంగ్లక్ షినవత్ర(46) కన్నీటిపర్యంతమయ్యారు.

థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ఇంగ్లక్ షినవత్ర(46) కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రతరమైన నేపథ్యంలో ఆమె మంగళవారం కేబినెట్ భేటీ నిర్వహించారు. పార్లమెంటును రద్దు చేసి, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 2లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా.. ‘మనమంతా థాయ్ వాసులం. ఎందుకు ఒకరిని ఒకరు బాధపెట్టుకుంటున్నాం? ఇప్పటికే నేను చాలా రాజీ పడ్డాను. ఇంకెంత దూరం నన్ను వెనక్కు వెళ్లమంటారు? థాయ్ నేలపై నేను అడుగుకూడా పెట్టకూడదని మీరు కోరుకుంటున్నారా?’ అని ఆందోళనకారులను ఉద్ధేశించి పేర్కొంటూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement