breaking news
Thailand Prime Minister
-
క్షమాపణలు చెప్పిన బ్యూటీఫుల్ ప్రధాని
థాయ్‌లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా(38)కు అధికారం చేపట్టిన పది నెలలకే పదవీగండం ఎదురైంది. పొరుగుదేశం నేతకు ఆమె చేసిన ఓ ఫోన్ కాల్ లీక్ అవడం.. ఏకంగా ప్రధాని పీఠానికి ఎసరు పెట్టింది. ఆమెను రాజీనామా చేయాలంటూ ఒకవైపు డిమాండ్లు వెల్లువెత్తగా.. ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.థాయ్‌లాండ్ బిలియనీర్, మాజీ ప్రధాని అయిన తక్సిన్ షినవత్రా కుమార్తె ప్రస్తుత థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా((Thailand PM Paetongtarn Shinawatra). గతేడాది ఆగస్టులో ఆమె ఆ పదవిని చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆమె.. ఆ దేశ చరిత్రలోనే అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. అందం, ఫ్యాషన్స్‌లోనూ స్టైల్ ఐకాన్‌గా, బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు.కాల్ సంభాషణ బయటకు..థాయ్‌లాండ్ (Thailand)కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్(Hun Sen)కి థాయ్ ప్రధాని షినవత్రా ఫోన్ చేశారు. ‘‘అంకుల్’’ అంటూ ఆయనను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దులో థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్‌సిన్ (Lt. Gen. Boonsin Padklangను ఉద్దేశించి) తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆమె ఆయనతో చెప్పారు పేర్కొన్నారు. అయితే, జూన్ 15వ తేదీన జరిగిన ఈ ఫోన్‌కాల్ సంభాషణ తాజాగా బయటకు వచ్చింది.సాధారణంగానే కంబోడియా-థాయ్‌లాండ్‌ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పైగా సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో(మే 28వ తేదీ నుంచి) అవి మరింతగా దెబ్బతిన్నాయి. అయితే.. 2023లో హున్ సేన్ ప్రధాని పదవి నుంచి దిగిపోగా.. ఆయన కుమారుడు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు. పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్సేన్. అలాంటి వ్యక్తితో షినవత్రా ఫోన్లో మాట్లాడడం.. పైగా దేశ భద్రతకు సంధించిన విషయాలను ప్రత్యర్థితో పంచుకున్న తీరు కూడా వివాదాస్పదమైంది.సొంత పక్షం నుంచే ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని ఫోన్‌తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్‌జాయ్‌థాయ్ పార్టీ విడిపోయింది. ప్రస్తుతం థాయ్ పార్లమెంట్లో కనీసం 69 మంది ఎంపీలు ఆమెకు మద్దతు విరమించుకున్నారు. దీంతో షినవత్రాకు స్వల్ప మెజార్టీ(500 సభ్యులన్న పార్లమెంట్లో 254 సభ్యుల మద్దతు) మాత్రమే మిగిలింది. ఈ వివాదం ఇలాగే కొనసాగినా.. మరో మిత్రపక్షం వైదొలిగినా.. ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది.చేతులు జోడించి..ఈలోపు ఈ బ్యూటీఫుల్ ప్రధాని డ్యామేజ్ కంట్రోల్‌కి దిగారు. ఫోన్ కాల్ లీక్ వ్యవహారంపై ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆర్మీ, పోలీస్ అధినేతల సమక్షంలో చేతులు జోడించి ఆమె ఆ పని చేశారు. నా ఉద్దేశం శాంతిని నెలకొల్పడమే. ఇకపై హున్ సేన్‌తో ప్రైవేట్ సంభాషణలు ఉండవని తేల్చి చెప్పారామె. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని, సైన్యానికి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారామె. ఈ క్షమాపణ థాయ్‌లాండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా ఆపుతుందా చూడాలి. -
థాయ్‌లాండ్ ప్రధాని షినవత్రకు రూ.3,431 కోట్ల ఆస్తులు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పెటాంగ్‌తర్న్ షినవత్ర తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. తనకు 400 మిలియన్ డాలర్ల (రూ.3,431 కోట్లు) ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు థాయ్‌లాండ్ జాతీయ అవినీతి నిరోధక కమిషన్(ఎన్‌ఏసీసీ)కు శుక్రవారం డిక్లరేషన్ సమర్పించారు. షినవత్రకు దేశ విదేశాల్లో పెద్ద సంఖ్యలో స్థిరచరాస్తులతోపాటు అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లు, చేతి గడియారాలు, విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. ఆమె వద్ద 200కుపైగా డిజైనర్ హ్యాంగ్బ్యాగ్లు ఉన్నాయి. వీటి విలువ 2 మిలియన్ డాలర్లు(రూ.17.15 కోట్లు). అలాగే 75 లగ్జరీ చేతి గడియారాల విలువ 5 మిలియన్ డాలర్లు (రూ.42.88 కోట్లు). షినవత్ర 2023 సెప్టెంబర్‌లో 37 ఏళ్ల వయసులో థాయ్‌లాండ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో అత్యంత పిన్నవయసు్కరాలైన ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఆమె తండ్రి థక్సిన్ షినవత్ర సహా కుటుంబంలో నలుగురు ప్రధానమంత్రులుగా పనిచేశారు. థక్సిన్ థాయ్‌లాండ్‌లో అత్యంత సంపన్నుడిగా రికార్డుకెక్కారు. -
Paetongtarn Shinawatra: నా నవ్వులు పిల్లలవి!
బిలియనీర్ కూతురు అయిన పేటోంగ్ టార్న్ పదిహేడేళ్ల వయసులోనే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 37 ఏళ్ల వయసులోనే థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా ఎంపికై చరిత్ర సృష్టించింది. తన ఇద్దరు పిల్లల నవ్వుల్లోంచి బలం తెచ్చుకొని రాజకీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ విజయపథంలో పయనిస్తోంది...థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర చిన్న కుమార్తె పేటోంగ్ టార్న్. తక్సిన్ మీద అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన దేశం విడిచి విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నాడు. దాంతో తండ్రి స్థాపించిన ‘ప్యూ థాయ్’ పార్టీకి పేటోంగ్ టార్న్ పెద్ద దిక్కుగా మారింది. బ్యాంకాక్‌లో పుట్టి పెరిగింది పేటోంగ్ టార్న్. పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ, సోషియాలజీలో పట్టా పుచ్చుకున్న పేటోంగ్ టార్న్ ఇంగ్లాండ్‌లో ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసింది. చదువులో రాణించిన పేటోంగ్ టార్న్ ఆ తరువాత వ్యాపారరంగంలో అడుగుపెట్టింది. 21 కంపెనీలతో తిరుగులేని ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకుంది.‘నేను ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాన్న రాజకీయాల్లోకి వచ్చారు’ అని చెబుతుంటుంది పేటోంగ్ టార్న్. పార్టీ నిర్వహణ, ఆ తరువాత ప్రధాన మంత్రిగా పనిచేసిన తండ్రి తక్సిన్ షినవత్రకు పిల్లలతో మాట్లాడే సమయం అతి తక్కువగా ఉండేది.‘నాకు నాన్న అంటే చాలా ఇష్టం. అయితే నాకంటూ సొంత వ్యక్తిత్వం ఉంది’ అంటున్న పేటోంగ్ టార్న్కు రాజకీయాల్లో చురుగ్గా ఉండడానికి కుటుంబ బలం అనేది ఎంత ముఖ్యమో తెలియనిది కాదు. రాజకీయ ప్రపంచం నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఇద్దరు పిల్లలే తన ప్రపంచం. పేటోంగ్ టార్న్ ముద్దు పేరు ఉంగ్–ఇంగ్. గ్రామీణ ప్రజలు పేటోంగ్ టార్న్ను ప్రేమగా ఉంగ్–ఇంగ్ అని పిలుచుకునేవారు. కమర్షియల్ పైలట్ పిటాక సూక్సావత్ను పేటోంగ్ వివాహం చేసుకుంది. వీరిది అన్యోన్య దాంపత్యంగా చెబుతుంటారు. భార్యకు ఉన్న సహనాన్ని, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రదర్శించే తెలివితేటలను పిటాక ప్రశంసిస్తుంటాడు.‘రాజకీయ నాయకురాలిగా మీకు ఎన్నో చికాకులు ఉంటాయి. అయినా సరే, ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు!’ అని అడిగితే ఆమె సమాధానం నవ్వు. ‘ఈ బలం నాకు నా పిల్లలు ఇచ్చారు’ అంటుంది ఆ నవ్వు మరింత పెంచుతూ!‘సోషల్లీ–లిబరల్ క్యాపిటలిస్ట్’గా తనను తాను అభివర్ణించుకునే పేటోంగ్ ముందు రాజ్యాంగాన్ని పునర్లిఖించడంతో సహా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన కుటుంబ బలం ఉండనే ఉంది. -
థాయిలాండ్ ప్రధానికి ఉద్వాసన
బ్యాంకాక్: అవినీతి మరక అంటుకున్న వ్యక్తిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుని నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ థాయిలాండ్ ప్రధాన మంత్రి స్రెట్టా థావీసిన్ను అక్కడి రాజ్యాంగ ధర్మాసనం ప్రధాని పదవి నుంచి తొలగించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీని రద్దుచేయాలంటూ ఒక కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన వారం రోజులకే ఇలా ప్రధాన మంత్రి పదవి ఊడిపోవడం గమనార్హం. ‘‘ నన్ను క్షమించండి. నన్ను కోర్టు అనైతిక ప్రధానిగా భావించిందిగానీ నేను అలాంటి వ్యక్తినికాదు. ఏదేమైనా కోర్టు తీర్పును శిరసావహిస్తా’ అని తీర్పు తర్వాత ప్రధాని స్రెట్టా వ్యాఖ్యానించారు. స్రెట్టాకు వ్యతిరేకంగా 5:4 మెజారిటీతో బుధవారం కోర్టు తీర్పు వెలువరిచింది. తక్షణం తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. ఏప్రిల్‌లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పిచిత్ చుయెన్బన్ను మంత్రిగా ఎంపికచేశారు. అయితే 2008లో ఆయన ఒక జడ్జికి 55వేల అమెరికన్ డాలర్లు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయి ఆరు నెలలపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యారు. అవినీతి నేతకు మళ్లీ మంత్రి పదవి కట్టబెట్టారంటూ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తడం తెల్సిందే. -
థాయ్ ప్రధాని తొలగింపు
అధికార దుర్వినియోగం కేసులో కోర్టు తీర్పు బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధాని ఇంగ్లక్ షినవత్రా(46)ను, ఆమె కేబినెట్లోని 9 మంది మంత్రులను రాజ్యాంగ కోర్టు బుధవారం పదవుల నుంచి తొలగించింది. షినవత్రా శక్తిమంతమైన తన కుటుంబానికి లబ్ధి చేకూర్చేందుకు ఓ అధికారి బదిలీలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. జాతీయ భద్రతా మండలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన థావిల్ ప్లీన్శ్రీని 2011లో అక్రమంగా బదిలీ చేశారని, ఇందులో షినవత్రా, 9 మంది మంత్రుల ప్రమేయముందని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే కేబినెట్.. ఉప ప్రధాని నివత్తుమ్రొంగ్ బూన్సంగ్పైసన్ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించింది. థావిల్ బదిలీని అసాధారణ రీతితో కేవలం నాలుగు రోజుల్లోనే హడావుడిగా పూర్తి చేశారని, సంబంధిత పత్రాల్లోని తేదీల్లో తేడాలున్నాయని కోర్టు ఆక్షేపించింది. కాగా, బదిలీతో తనకు సంబంధం లేదని, ఆ వ్యవహారాన్ని ఉప ప్రధానికి అప్పగించానని షినవత్రా విచారణలో చెప్పారు. కోర్టు తీర్పుపై ప్రభుత్వ వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేయగా, అది తమను గద్దె దింపేందుకు చేసిన కుట్ర అని అధికార పార్టీ ఫ్యూ థాయ్ విమర్శించింది. కోర్టు తీర్పుతో థాయ్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం మరికొంత కాలం కొనసాగనుంది. -
కన్నీళ్లు పెట్టుకున్న థాయ్‌లాండ్ ప్రధాని
థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ఇంగ్లక్ షినవత్ర(46) కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రతరమైన నేపథ్యంలో ఆమె మంగళవారం కేబినెట్ భేటీ నిర్వహించారు. పార్లమెంటును రద్దు చేసి, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 2లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా.. ‘మనమంతా థాయ్ వాసులం. ఎందుకు ఒకరిని ఒకరు బాధపెట్టుకుంటున్నాం? ఇప్పటికే నేను చాలా రాజీ పడ్డాను. ఇంకెంత దూరం నన్ను వెనక్కు వెళ్లమంటారు? థాయ్ నేలపై నేను అడుగుకూడా పెట్టకూడదని మీరు కోరుకుంటున్నారా?’ అని ఆందోళనకారులను ఉద్ధేశించి పేర్కొంటూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.