నేపాల్‌లో కరోనా నుంచి కోలుకున్న భారతీయులు!

Six Indian Corona Patients Discharged From Hospital in Nepal  - Sakshi

ఖాట్మాండు: నేపాల్‌లో కరోనా సోకిన ఆరుగురు భారతీయులు బుధవారం డిశార్జ్‌ అయ్యారు. బిరాత్‌నగర్‌లోని కోశి హస్పటల్‌లో ఐసోలేషన్‌ వార్డులో వీరిని ఉంచి చికిత్స అందించారు. వారిని చాలా సార్లు పరీక్షించి, పరిశీలించిన తరువాత నెగిటివ్‌ అని తేలడంతో హాస్పటల్‌ నుంచి డిశార్జ్‌ చేసినట్లు కోశి హాస్పటల్‌ సూపరింటెండెంట్‌ సంగీత మిశ్రా తెలిపారు. రెండు సార్లు వారికి కరోనా నెగిటివ్‌ వచ్చిందని, 19 రోజుల పాటు ఆసుప్రతిలో ఉంచి పూర్తిగా కోలుకున్న తరువాతే డిశార్జ్‌ చేశామని తెలిపారు. (ఇటలీ : రోనా వ్యాక్సిన్ నిపెట్టేశాం!)

కోలుకున్న వారందరికి నేపాల్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి జీవన్‌ గిమైర్‌ ఆసుపత్రి ప్రాంగణంలో వీడ్కోలు పలికారు. మరో ఏడుగురు భారతీయులు కరోనా సోకి ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని డాక్టర్‌ మిశ్రా తెలిపారు. కోలుకున్న ఈ ఆరుగురితో కలిపి నేపాల్‌లో మొత్తం 22మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. నేపాల్‌ దేశంలో  60 మంది ఇంకా వివిధ ఆసుపత్రుల్లో కరోనా సోకి పరిశీలనలో ఉన్నారు. (ఎక్కువ మంది చనిపోతారు.. మాస్కు పెట్టుకోను)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top