'సెల్ఫీ'తో దొంగ దొరికింది! | Security app Lookout clicks Thief's Selfie, gets her arrested | Sakshi
Sakshi News home page

'సెల్ఫీ'తో దొంగ దొరికింది!

Jul 28 2014 10:24 AM | Updated on Nov 6 2018 5:26 PM

'సెల్ఫీ'తో దొంగ దొరికింది! - Sakshi

'సెల్ఫీ'తో దొంగ దొరికింది!

అమెరికాలోని ఫ్లోరిడా నగరం. క్యాథీ అనే ఓ మహిళ... డాక్టరు దగ్గరకు వెళుతూ తన స్మార్ట్ ఫోన్ను కారులో మరచిపోయింది.

ఫ్లోరిడా : అమెరికాలోని ఫ్లోరిడా నగరం. క్యాథీ అనే ఓ మహిళ... డాక్టరు దగ్గరకు వెళుతూ తన స్మార్ట్ ఫోన్ను కారులో మరచిపోయింది. అక్కడే ఉన్న ఓ లేడీ దొంగ ఆ ఫోన్ను కొట్టేసి లాక్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించింది. అంతే.... ఫోన్ ఆ దొంగ ముఖాన్ని ఫోటో తీయడమూ, ఫోటోతో పాటు ఆ ప్రదేశం మ్యాప్ను క్యాథీకి ఈ-మెయిల్ చేయడమూ వెంటవెంటనే జరిగిపోయాయి.

ఆ తర్వాత దొంగ ఫోటోను కార్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో క్యాథీ స్నేహితుల్లో ఒకరు ఆ దొంగను గుర్తుపట్టారు. ఇంకేం లేడీ దొంగ కటకటాల వెనక్కి వెళ్లింది. ఫోన్ కార్టర్ చేతికి వచ్చేంది. ఇంతకూ ఇదెలా సాధ్యమైంది? కార్టర్ మొబైల్లో 'లుకౌట్' అనే మొబైల్ ఆప్ను ఇన్స్టాల్ చేయడం వల్లే! పాస్వర్డ్ను తప్పుగా కొట్టినప్పుడు ఫోన్ ఎదురుగా ఉన్నవారి ఫోటోలు, ఆ ప్రదేశం వివరాలను ఈ ఆప్ ఈ-మెయిల్ చేస్తుందట. ఆ ఫోన్ ను ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ఉపయోగించారన్నది కూడా మ్యాప్ ద్వారా యజమానికి తెలియచేస్తుందట.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement