మూత్రంతో బీరు తయారీ..! | Sakshi
Sakshi News home page

మూత్రంతో బీరు తయారీ..!

Published Wed, Jul 27 2016 10:23 AM

మూత్రంతో బీరు తయారీ..! - Sakshi

సాధారణంగా బీరు తాగగానే యూరిన్కు పరిగెత్తేవారిని మనం చూస్తూనే ఉంటాం. మరి అలాంటిది యూరిన్తోనే బీర్ తయారుచేస్తే ఎలా ఉంటుంది. చాలా చండాలంగా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ బెస్ట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్తో ఉండే బీర్ను యూరిన్తో తయారుచేసే టెక్నిక్ను కనుగొన్నారు పరిశోధకులు.

బెల్జియంలోని ఘెంట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కేవలం సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని యూరిన్ను నీరుగా మార్చే మెషిన్ను కనుగొన్నారు. ఈ విధానంలో.. పెద్ద ట్యాంక్లో యూరిన్ను స్టోర్ చేసి సోలార్ పవర్తో పనిచేసే బాయిలర్లో వేడి చేస్తారు. అనంతరం దానిని ఒక పొరగుండా పంపినప్పుడు పొటాషియం, నైట్రోజన్, పాస్పరస్ లాంటి ఖనిజాలతో పాటునీరు వేరవుతుంది. ఇటీవలే సెంట్రల్ ఘెంట్లో 10 రోజుల పాటు నిర్వహించిన మ్యూజిక్, థియెటర్ ఫెస్టివల్లో 'పీ ఫర్ సైన్స్' పేరుతో ఈ మెషిన్ను ఉంచి సుమారు వెయ్యి లీటర్ల యూరిన్ను సేకరించారు. దీంతో బెల్జియంలోనే మాంచి టేస్టున్న బీరును తయారుచేయనున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ప్రక్రియలో వెలువడిన ఖనిజాలను పంటలకు ఎరువులుగా కూడా వాడుకోవచ్చని డాక్టర్ డెరెసి వెల్లడించారు.

Advertisement
Advertisement