అమ్మాయిలు జుట్టు కత్తిరించుకుంటే సస్పెన్షనే | Saudi Arabia's university GO issues on dress code for women | Sakshi
Sakshi News home page

అమ్మాయిలు జుట్టు కత్తిరించుకుంటే సస్పెన్షనే

Mar 14 2017 3:40 PM | Updated on Sep 5 2017 6:04 AM

అమ్మాయిలు జుట్టు కత్తిరించుకుంటే సస్పెన్షనే

అమ్మాయిలు జుట్టు కత్తిరించుకుంటే సస్పెన్షనే

అబ్బాయిల్లా జుత్తు కత్తిరించుకోవటం, డ్రెస్‌ వేసుకోవటం వంటివి చేయవద్దంటూ సౌదీ అరేబియాలోని ఓ యూనివర్సిటీ అమ్మాయిలను హెచ్చరించింది.

రియాద్‌: అబ్బాయిల్లా జుత్తు కత్తిరించుకోవటం, డ్రెస్‌ వేసుకోవటం వంటివి చేయవద్దంటూ సౌదీ అరేబియాలోని ఓ యూనివర్సిటీ అమ్మాయిలను హెచ్చరించింది. మహ్మద్‌ బిన్‌ సౌద్‌ ఇస్లామిక్‌ యూనివర్సిటీ ఈ మేరకు విద్యార్థినులకు హెచ్చరికలు చేసిందని స్థానిక దినపత్రిక ఒకజ్‌ డెయిలీ తెలిపింది. వచ్చే నెల నుంచి ఈ మేరకు ఉత్తర్వులు అమలవుతాయని పేర్కొంది. ఈ ఉత్తర్వులను ధిక్కరించిన వారిని వర్సిటీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించిందని వివరించింది. సౌదీలో స్త్రీ, పురుషులకు వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి.
 
మగవారిని అనుకరిస్తూ అమ్మాయిలు జుత్తు పొట్టిగా కత్తిరించుకోవటాన్ని సంప్రదాయ ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యా సంస‍్థల్లోనూ విద్యార్థినులు, విద్యార్థులకు వేర్వేరు భవనాల్లో బోధన సాగుతుంది. యూనివర్సిటీలు మినహా మిగతా అన్ని స్థాయి విద్యా సంస్థల్లోనూ విద్యార్థినులకు మహిళా ఉపాధ్యాయులే టీచర్లుగా ఉంటారు. వర్సిటీల్లో మాత్రం పురుష ప్రొఫెసర్లు బోధించే సమయంలో విద్యార్థినులకు వేరే పార్టిషన్‌ ఏర్పాటు ఉంటుంది లేదా ప్రొఫెసర్ కనబడకుండా పార్టిషన్‌లో ఉంచుతారు. 
 
సౌదీలో మత చట్టాల అమలు ఎంత కచ్చితంగా ఉంటుందో చెప్పేందుకు ఓ ఉదాహరణ ఇది. 2002లో మక్కాలోని ఓ బాలికల పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే, అందులో ఉండే విద్యార్థినులను రక్షించాల్సిన పోలీసులు.. వారు ఇస్లామిక్‌ చట్టాల ప్రకారం డ్రెస్‌ వేసుకోలేదనే కారణంగా బయటకు వెళ్లనివ్వలేదు. దీంతో 15 మంది బాలికలు మంటల్లో చిక్కి ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement