breaking news
hair chop
-
అమ్మాయిలు జుట్టు కత్తిరించుకుంటే సస్పెన్షనే
రియాద్: అబ్బాయిల్లా జుత్తు కత్తిరించుకోవటం, డ్రెస్ వేసుకోవటం వంటివి చేయవద్దంటూ సౌదీ అరేబియాలోని ఓ యూనివర్సిటీ అమ్మాయిలను హెచ్చరించింది. మహ్మద్ బిన్ సౌద్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఈ మేరకు విద్యార్థినులకు హెచ్చరికలు చేసిందని స్థానిక దినపత్రిక ఒకజ్ డెయిలీ తెలిపింది. వచ్చే నెల నుంచి ఈ మేరకు ఉత్తర్వులు అమలవుతాయని పేర్కొంది. ఈ ఉత్తర్వులను ధిక్కరించిన వారిని వర్సిటీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించిందని వివరించింది. సౌదీలో స్త్రీ, పురుషులకు వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి. మగవారిని అనుకరిస్తూ అమ్మాయిలు జుత్తు పొట్టిగా కత్తిరించుకోవటాన్ని సంప్రదాయ ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యా సంస్థల్లోనూ విద్యార్థినులు, విద్యార్థులకు వేర్వేరు భవనాల్లో బోధన సాగుతుంది. యూనివర్సిటీలు మినహా మిగతా అన్ని స్థాయి విద్యా సంస్థల్లోనూ విద్యార్థినులకు మహిళా ఉపాధ్యాయులే టీచర్లుగా ఉంటారు. వర్సిటీల్లో మాత్రం పురుష ప్రొఫెసర్లు బోధించే సమయంలో విద్యార్థినులకు వేరే పార్టిషన్ ఏర్పాటు ఉంటుంది లేదా ప్రొఫెసర్ కనబడకుండా పార్టిషన్‌లో ఉంచుతారు. సౌదీలో మత చట్టాల అమలు ఎంత కచ్చితంగా ఉంటుందో చెప్పేందుకు ఓ ఉదాహరణ ఇది. 2002లో మక్కాలోని ఓ బాలికల పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే, అందులో ఉండే విద్యార్థినులను రక్షించాల్సిన పోలీసులు.. వారు ఇస్లామిక్ చట్టాల ప్రకారం డ్రెస్ వేసుకోలేదనే కారణంగా బయటకు వెళ్లనివ్వలేదు. దీంతో 15 మంది బాలికలు మంటల్లో చిక్కి ప్రాణాలు కోల్పోయారు. -
అమ్మాయిలకు జుట్టు పొడుగ్గా ఉందని..
-
అమ్మాయిలకు జుట్టు పొడుగ్గా ఉందని..
రాయ్‌గఢ్: చత్తీస్‌గఢ్‌లో రాయ్‌గఢ్ జిల్లాలోని నహర్‌పాలి ప్రభుత్వ పాఠశాల టీచర్ విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పుష్పేంద్ర పటేల్ అనే లెక్కల టీచర్ తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినుల జుట్టును కత్తిరించాడు. గురువారం పుష్పేంద్ర పటేల్ రెండు కత్తెరలు తీసుకుని అమ్మాయిల వెంట్రుకలను కత్తిరించాడు. స్కూలుకు వచ్చేది చదువుకునేందుకే కానీ పొడవాటి వెంట్రుకలను ప్రదర్శించడానికి కాదంటూ అమ్మాయిలపై మండిపడ్డాడు. ఇంటికి వెళ్లిన తర్వాత బాధిత అమ్మాయిలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పుష్పేంద్ర పటేల్‌ను అరెస్ట్ చేశారు.