అమ్మాయిలకు జుట్టు పొడుగ్గా ఉందని.. | School teacher chops off hair of six girl students | Sakshi
Sakshi News home page

అమ్మాయిలకు జుట్టు పొడుగ్గా ఉందని..

Nov 11 2016 7:28 PM | Updated on Sep 4 2017 7:50 PM

అమ్మాయిలకు జుట్టు పొడుగ్గా ఉందని..

అమ్మాయిలకు జుట్టు పొడుగ్గా ఉందని..

చత్తీస్‌గఢ్‌లో రాయ్‌గఢ్‌ జిల్లాలోని నహర్‌పాలి ప్రభుత్వ పాఠశాల టీచర్‌ విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.

రాయ్‌గఢ్‌: చత్తీస్‌గఢ్‌లో రాయ్‌గఢ్‌ జిల్లాలోని నహర్‌పాలి ప్రభుత్వ పాఠశాల టీచర్‌ విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పుష్పేంద్ర పటేల్‌ అనే లెక్కల టీచర్‌ తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినుల జుట్టును కత్తిరించాడు.

గురువారం పుష్పేంద్ర పటేల్‌ రెండు కత్తెరలు తీసుకుని అమ్మాయిల వెంట్రుకలను కత్తిరించాడు. స్కూలుకు వచ్చేది చదువుకునేందుకే కానీ పొడవాటి వెంట్రుకలను ప్రదర్శించడానికి కాదంటూ అమ్మాయిలపై మండిపడ్డాడు. ఇంటికి వెళ్లిన తర్వాత బాధిత అమ్మాయిలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పుష్పేంద్ర పటేల్‌ను అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement