మధుమేహానికి ప్రొటీన్‌తో విరుగుడు

protein useful for diabetes - Sakshi - Sakshi

వాషింగ్టన్‌: ప్రస్తుతం ప్రపంచాన్ని మధుమేహ మహమ్మారి పట్టి పీడిస్తోంది. కొన్ని కోట్ల మంది దీని బారినపడి నరకయాతన అనుభవిస్తున్నారు. అయితే ఎశ్చిమిక్‌ టిష్యూలో రక్త సరఫరా తగ్గడం వల్లే చాలా మందికి డయాబెటిస్‌ వస్తోంది. దీన్ని నివారించడానికి రక్తనాళాలకు తిరిగి ఉత్పత్తి చేయగలిగే కిటుకును అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతరించిపోయిన రక్తనాళ ప్రదేశాల్లోనే కొత్త వాటిని ఉత్పత్తి చేస్తే ఎశ్చిమిక్‌ టిష్యూలో రక్తసరఫరా పెరిగి, డయాబెటిస్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో రక్తనాళాల పనితీరు జరగాలంటే కినాసే (ఆర్‌–ఆర్‌ఏఎస్‌) ప్రొటీన్‌ అవసరమని తెలిపారు.

ప్రస్తుతం తాము కనగొన్న ఈ పద్ధతి వైద్యశాస్త్రంలో చాలా కీలకమని వివరించారు. ఇప్పటివరకు రక్త నాళికల అభివృద్ధి మీద చాలా పరిశోధనలు చేశామని, అయితే ఏవీ సఫలం కాలేదన్నారు. ప్రస్తుతం తాము పరిశోధనలు చేసిన ఆర్‌–ఆర్‌ఏఏస్‌ను రక్తనాళాలకు అందిస్తే డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గుతాయని చెబుతున్నారు. దీనిపై భవిష్యత్తులో మరిన్నీ పరిశోధనలు చేసి జీన్‌ థెరపీ లేదా వీఈజీఎఫ్‌ థెరపీ ద్వారా ఆర్‌–ఆర్‌ఏఏస్‌ను రక్తనాళాలకు అందించడానికి పరిశోధనలు చేస్తామన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top