దీంతో కుక్కలూ సెల్ఫీ తీసుకుంటాయి! | Posting Tail Wearable Tech Vest Lets Dogs Take Selfies | Sakshi
Sakshi News home page

దీంతో కుక్కలూ సెల్ఫీ తీసుకుంటాయి!

Apr 21 2016 9:34 AM | Updated on Sep 29 2018 4:26 PM

దీంతో కుక్కలూ సెల్ఫీ తీసుకుంటాయి! - Sakshi

దీంతో కుక్కలూ సెల్ఫీ తీసుకుంటాయి!

'ద పోస్టింగ్ టెయిల్' అనే ఈ జాకెట్‌ను మీ కుక్కకు తొడిగితే.. అది ఆనందంతో తోక ఊపినప్పుడల్లా దాని ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ అయిపోతుంది.

సోషల్ మీడియాలో తమ పెంపుడు జంతువుల ఫొటోలు పెట్టడం వంటివి ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. కొందరైతే వాటి కోసం ప్రత్యేకంగా అకౌంట్లు కూడా సృష్టించేస్తున్నారు. రోజూ యజమానులు తమ శునకాల చిత్రాలను తీయడం, నెట్‌లో పెట్టడం ఇదో పెద్ద పని.. ఇప్పుడిక బేఫికర్. ఎందుకంటే ఇకపై కుక్కలే తమ ఫొటోలు తీసుకుని.. ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాయి! మీరు వింటున్నది నిజమే.. పెట్ ఫుడ్ బ్రాండ్ 'పెడిగ్రీ' ఇందుకోసం ఓ ప్రత్యేకమైన జాకెట్‌ను తయారుచేసింది.

'ద పోస్టింగ్ టెయిల్' అనే ఈ జాకెట్‌ను మీ కుక్కకు తొడిగితే.. అది ఆనందంతో తోక ఊపినప్పుడల్లా దాని ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ అయిపోతుంది. అలాగని తోక ఊపినప్పుడల్లా ఫొటో తీయదు.. ఆనందంగా తోక ఊపినప్పుడు మాత్రమే ఫొటో తీస్తుంది. ఇందుకోసం కుక్క తోక వద్ద ఓ సెన్సర్ ఉంటుంది. మామూలుగా తోక ఊపడానికి, ఆనందంతో ఊపడానికి మధ్య తేడాను ఇది కనిపెట్టగలదట.

అంతేకాదు.. ఇందులో ఉండే జీపీఎస్ ద్వారా మీ శునకం ఏ ప్రాంతానికెళ్తే హ్యాపీగా ఉంటోందన్న విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. శునకాలు తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. మీ కుక్క ఎప్పుడు, ఎక్కడ, ఏ ఆహారం తింటున్నప్పుడు హ్యాపీగా ఉంటుందన్న విషయాన్నీ తెలియపరుస్తుంది. త్వరలో ఇది మార్కెట్లోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement