భారత్‌పైకి ఎఫ్-16! | Pakistan may use F-16 fighter jets against India, not terrorism | Sakshi
Sakshi News home page

భారత్‌పైకి ఎఫ్-16!

Apr 29 2016 4:29 AM | Updated on Sep 3 2017 10:58 PM

భారత్‌పైకి ఎఫ్-16!

భారత్‌పైకి ఎఫ్-16!

ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్‌కు అమెరికా విక్రయించడంపై ఆ దేశ చట్టసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

వాషింగ్టన్: ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్‌కు అమెరికా విక్రయించడంపై ఆ దేశ చట్టసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికాకు చెందిన 8 ఎఫ్-16 జెట్ విమానాలను పాకిస్తాన్‌కు విక్రయించాలని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించారు. ఎఫ్-16 జెట్ విమానాలను పాకిస్తాన్ విక్రయిస్తే ఉగ్రవాదంపై పోరాడడానికి బదులుగా భారత్‌పై పాక్ వాటిని వినియోగిస్తుందని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు హెచ్చరించారు.
 
‘ద్వైపాక్షిక భేటీపై చర్చించలేదు’
న్యూఢిల్లీ: భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల మధ్య మంగళవారం జరిగిన సమావేశం పూర్తిస్థాయి ద్వైపాక్షిక చర్చల్లో భాగం కాదని భారత్ స్పష్టం చేసింది. పఠాన్‌కోట్ పేలుళ్ల అంశంలో పాక్‌లో ఎన్‌ఐఏ పర్యటన ఖరారు, పాక్ బృందం భారత పర్యటన అనంతరం పురోగతిపై చర్చించారని విదేశాంగ కార్యదర్శి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement