12 మంది విమాన సిబ్బంది అరెస్ట్ | Sakshi
Sakshi News home page

12 మంది విమాన సిబ్బంది అరెస్ట్

Published Mon, Aug 1 2016 8:34 AM

12 మంది విమాన సిబ్బంది అరెస్ట్ - Sakshi

లాహోర్: విమానాశ్రయాల్లో మాదకద్రవ్యాలు, బంగారం అక్రమరవాణా చేస్తూ పట్టుబడే వ్యక్తులను సధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఎయిర్లైన్స్ సిబ్బందే అక్రమరవాణాకు పాల్పడితే..! అదే జరిగింది పాకిస్తాన్లో. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ)కు చెందిన 12 మంది సిబ్బంది హెరాయిన్ అక్రమరవాణా చేస్తూ ఆదివారం పట్టుబడ్డారు. లాహోర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో పెద్ద ఎత్తున మత్తుపదార్థాలు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ ఫోర్స్(ఎఎన్ఎఫ్).. విమానం టాయ్లెట్లో 6 కిలోల హెరాయిన్ను గుర్తించింది. దీని విలువ సుమారు ఆరు కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

తమ సిబ్బంది 12 మంది అరెస్టు అయిన విషయాన్ని పీఐఏ స్పోక్స్ పర్సన్ డానియల్ గిలానీ ధృవీకరించారు. విచారణలో దోషులుగా తేలిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పీఐఏ సిబ్బంది ఇటీవల డ్రగ్స్, సిగరెట్లు, అక్రమ పాస్పోర్ట్లు, మొబైల్ ఫోన్లు తరలిస్తూ పట్టుబడటం సర్వసాధారణంగా మారింది. అయితే.. ఒకేసారి ఎక్కువ మొత్తంలో సిబ్బంది ప్రమేయం ఉడటం కలకలం సృష్టిస్తోంది.
 

Advertisement
Advertisement