ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో పాకిస్తాన్ లో మరో అరెస్టు జరిగింది. పంజాబ్ లోని యూనివర్సిటీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ కు చెందిన గలీబ్ అటా అనే ప్రొఫెసర్ ని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు
లాహోర్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో పాకిస్తాన్ లో మరో అరెస్టు జరిగింది. పంజాబ్ లోని యూనివర్సిటీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ కు చెందిన గలీబ్ అటా అనే ప్రొఫెసర్ ని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద వ్యతిరేక బలగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ప్రత్యేక రైడింగ్ లు జరిపిమరీ అతడిని అరెస్టు చేశారు.
గత వారంలో అరెస్టయిన ఉగ్రవాద నేత హిజ్బుత్ తహ రీర్ కు గలీబ్ కు సంబంధాలు ఉన్నాయని తమ విచారణలో తేలిందని అందుకే ఆయనను ఉన్నపలంగా అరెస్టు చేసినట్లు పాక్ అధికారులు చెప్పారు. ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేస్తున్నాడని, గతంలో ఎవరికీ తెలియకుండా తీవ్ర భావజాల వ్యాప్తికి సంబంధించిన సమావేశాలకు కూడా గలీబ్ హాజరు అయ్యాడని తెలిపారు.