ప్రధాని ‘చికెన్‌ డ్యాన్స్‌’.. వీడియో వైరల్‌

Netanyahu Could not Resist Doing Chicken Dance - Sakshi

టెల్‌ అవీవ్‌, ఇజ్రాయెల్‌ : సంగీతానికి రాళ్లయినా కరగాల్సిందే..! అనే సామెత మనందరికి తెలుసు. మనసుని ఉర్రూతలూగించే పాటకు ఎవరి పాదమైనా కదలక మానదు. ఇజ్రాయెల్‌ దేశాధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహుకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. యూరో విజన్‌ పాటల పోటీలో విజేతగా నిలిచిన నెటా బార్జీలాల్‌ పాటకు నెతన్యాహు స్టెప్పులు వేశారు.

ఓ వైపు ప్రేక్షకుల్ని కట్టిపడేసే బార్జీ పాట.. మరోవైపు నెతాన్యాహు ‘చికెన్‌ డాన్స్‌’తో అక్కడున్న వారంతా గుక్క తిప్పుకోలేకపోయారు. బుధవారం ప్రధాని అధికార నివాసంలో జరిగిన యూరో విజన్‌ పాటల పోటీ విజేత బార్జీలాల్‌ సన్మాన కార్యక్రమంలో ఈ విశేషం చోటు చేసుకుంది. ప్రధాని భార్య సారా కూడా పాల్గొన్న ఈ కార్యక్రమ విశేషాలను నెతన్యాహు ట్విటర్‌లో పంచుకున్నారు.

‘నిజంగా ఇది మర్చిపోలేని రోజు. మీతో ఆడి పాడడం గొప్ప అనుభూతి. దేశం ఖ్యాతి పెంచిన మీకు అభినందనలు’ అంటూ నెతన్యాహు ఆనందం వ్యక్తం చేశారు. యూరో విజన్‌ విజేత నెటా బార్జీలాల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

లిస్బన్‌లో శనివారం జరిగిన యూరోవిజన్‌ పోటీలో బార్జీలాల్‌ పాల్గొన్నారు. జపనీస్‌ వస్త్రధారణతో ఆడిపాడిన 25 ఏళ్ల బార్జీ తన అద్భుత ప్రదర్శనతో ప్రతిష్టాత్మక పోటీలో విజేతగా అవతరించారు. ‘ఐ యామ్‌ నాట్‌ యువర్‌ టాయ్‌’అంటూ స్త్రీ సాధికారత ప్రధానంగా సాగిన బార్జీ పాటను ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది వీక్షించారు. కాగా, వచ్చే ఏడు యూరో విజన్‌ పోటీలకు ఇజ్రాయెల్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top