ఓ పెంపుడు కుక్క ఓనర్‌పై నెటిజన్లు ఫైర్‌!

Man In China Put His Dog On Car Roof While Driving On Road - Sakshi

బీజింగ్‌ : కారులో ఉంచటానికి స్థలం లేదన్న కారణంతో పెంపుడు కుక్కను ఎలాంటి రక్షణ లేని కారు టాప్‌పై ఉంచి ప్రయాణించాడో యాజమాని. ఈ సంఘటన చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. సిచువాన్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన కారులో స్థలం లేని కారణంగా పెంపుడు కుక్కను ఎలాంటి రక్షణ లేని తన కారు టాప్‌పై ఉంచి ప్రయాణించాడు. బిజీ రోడ్డులో వేగంగా వెళుతున్న కారు టాప్‌పై నల్ల కుక్క ఉండటం గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కారులో స్థలం లేని కారణంగానే తాను కుక్కను టాప్‌పై ఉంచాల్సి వచ్చిందని అతడు తెలిపాడు. కుక్కకు ఇంజెక్షన్‌ వేయించటానికి తీసుకెళుతున్నానని, ఆ సమయంలో వెనుక సీటు నిండా సామాన్లు ఉన్నాయని, అక్కడ దాన్ని ఉంచితే ఉక్కపోతకు గురవుతుందని చెప్పాడు. ( నెటిజన్లు ఫైర్‌.. ఫర్వాలేదు అంటున్న ఎంపీ )

కారుటాప్‌పై ఉన్న కుక్క

‘‘ ఒక వేళ కారు టాప్‌పైనుంచి కుక్క కిందకు దూకి ఉంటే’’ అని పోలీసులు ప్రశ్నించగా.. ‘‘ అది బాగా శిక్షణ పొందిన కుక్క’’ అని సమాధానమిచ్చాడు. లేషన్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ థూ.. నువ్వసలు మనిషివేనా!... పాపం కుక్క.. భయపడిపోయి ఉంటుంది. చైనాలో జంతువుల సంరక్షణ కోసం మంచి చట్టాలు రావాలి... చైనాలో అంతే! చైనాలో అంతే!... ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.  ( రోడ్ల మీద తిరుగుతున్న క‌రోనా )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top