‘ఎఫ్‌’ నుంచి ‘ఏ’ గ్రేడ్‌కు!

Indian-origin student at Kansas varsity pleads guilty of hacking - Sakshi

ప్రొఫెసర్‌ కంప్యూటర్‌ హ్యాక్‌చేసిన భారత సంతతి విద్యార్థి 

కన్సాస్‌: ఎక్కువ మార్కుల కోసం తల్లిదండ్రులు పిల్లలపై తెస్తున్న ఒత్తిడి ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో చెప్పడానికి తాజా ఉదాహరణే ఇది. భారత సంతతికి చెందిన వరుణ్‌ సార్జా(20) అనే విద్యార్థి అమెరికాలోని కాన్సాస్‌ యూనివర్సిటీలో 2016లో ఇంజనీరింగ్‌లో చేరాడు. అయితే మొదటి సంవత్సరం పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడంతో ఇంట్లో తల్లిదండ్రులు తిడతారని భయపడ్డ వరుణ్‌ అడ్డదారి తొక్కాడు. కీస్ట్రోక్‌ లాగర్‌ అనే హ్యాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి తన గణితం ప్రొఫెసర్‌ కంప్యూటర్‌ను హ్యాక్‌ చేశాడు.

అనంతరం పరీక్షల్లో తనకు వచ్చిన ‘ఎఫ్‌’ గ్రేడ్‌ను ‘ఏ’ గ్రేడ్‌గా మార్చుకున్నాడు. ఇదే తరహాలో మిగిలిన 9 సబ్జెక్టుల్లోనూ ఏ గ్రేడ్‌ వచ్చినట్లు హ్యాక్‌ చేయగలిగాడు. అయితే గణితంలో ఎన్నడూ మంచిమార్కులు తెచ్చుకోని సార్జాకు ఏకంగా ‘ఏ’ గ్రేడ్‌ రావడంపై అకడమిక్‌ అడ్వైజర్‌కు అనుమానం వచ్చి మార్కుల్ని తనిఖీ చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సార్జాకు ఇక్కడి కోర్టు 18 నెలల జైలుశిక్ష విధించింది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top