బాక్సర్‌ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ అనుమానాస్పద మృతి..

Girlfriend Of Boxer Floyd Mayweather Found Lifeless In US - Sakshi

లాస్‌ఏంజెల్స్‌ : మాజీ బాక్సింగ్‌ ఛాంపియన్‌ మెవెదర్‌ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ జోసీ హారిస్‌ సబర్బన్‌ లాస్‌ఏంజెల్స్‌లోని తన నివాసంలో మరణించారు. మెవెదర్‌తో ముగ్గురు సంతానం కలిగిన జోసీ హారిస్‌ (40) తన ఇంట్లోనే వాక్‌వేలోని ఓ వాహనంలో విగతజీవిగా పడిఉన్నారని లాస్‌ఏంజెల్స్‌ కౌంటీ షరీఫ్‌ అలెక్స్‌ విలెనువా వెల్లడించారు. ఆమె మృతిపై దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. 2010లో మెవెదర్‌ హారిస్‌ను తీవ్రంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. తాను హారిస్‌పై చేయిచేసుకున్నానని, ఆమె చేతిని మెలితిప్పానని ఓ ఇంటర్వ్యూలో అంగీకరించాడు.  గృహ హింస ఆరోపణలపై రెండు నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో డ్రగ్స్‌ తీసుకున్న హారిస్‌ను నియంత్రించేందుకే తానలా చేశానని వివరణ ఇచ్చుకున్నాడు. ఇక హారిస్ 2015లో మెవెదర్‌పై పరువునష్టం దావా వేశారు.

చదవండి : షరపోవా.. అన్‌స్టాపబుల్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top