కారును ఆపమన్నందుకు పోలీసుపై కాల్పులు | Georgia deputy shot in the face during traffic stop | Sakshi
Sakshi News home page

కారును ఆపమన్నందుకు పోలీసుపై కాల్పులు

May 29 2016 1:29 PM | Updated on Aug 21 2018 5:54 PM

కారును ఆపమన్నందుకు పోలీసుపై కాల్పులు - Sakshi

కారును ఆపమన్నందుకు పోలీసుపై కాల్పులు

కారును ఆపమ్మన్నందుకు ఓ పోలీసు అధికారిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

వాషింగ్టన్: కారును ఆపమ్మన్నందుకు ఓ పోలీసు అధికారిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అమెరికాలోని అట్లాంటాలో శనివారం రాత్రి  చోటు చేసుకున్న ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ పోలీసు అధికారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాలు ఇవి.

అట్లాంటా సిటీ దక్షిణ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు అధికారి అటుగా వస్తున్న కారును ఆపమని కోరాడు. ఈ క్రమంలో కారు దగ్గరకు నడుచుకుంటూ వెళ్తున్న అతడిపై కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులలో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో పోలీసు అధికారి ఎడమ కంటి పై భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. మిగతా పోలీసులు తేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు పోలీసు అధికారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పులకు పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని విచారణ అధికారి మైక్ జోల్లీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పోలీసు అధికారి డ్యాష్ కెమేరాలో రికార్డయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement