విమానం కిటికిలోంచి పైలట్ దూకేశాడు! | EgyptAir hijacker arrested after 7 remaining passengers leave aircraft | Sakshi
Sakshi News home page

విమానం కిటికిలోంచి పైలట్ దూకేశాడు!

Mar 29 2016 6:11 PM | Updated on Jul 11 2019 6:15 PM

విమానం కిటికిలోంచి పైలట్ దూకేశాడు! - Sakshi

విమానం కిటికిలోంచి పైలట్ దూకేశాడు!

ఈజిప్టు విమానం హైజాక్‌ వ్యవహారం ప్రయాణికులను కాసేపు ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఈజిప్టు విమానం హైజాక్‌ వ్యవహారం ప్రయాణికులను కాసేపు ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రాణాలు అరచేత పట్టుకొని బందీలుగా వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇంతటి హైడ్రామా నడుమ బందీగా చిక్కిన ఓ ప్రయాణికుడు ఏకంగా హైజాకర్‌తోనే సెల్ఫీ దిగాడు. ఆత్మాహుతి జాకెట్ తో ఉన్న హైజాకర్‌తో అతను ఫొటో దిగడం విస్మయం కలిగిస్తోంది.

ఇక ఆత్మాహుతి జాకెట్ ధరించిన సీఫ్ ఎల్ దిన్ ముస్తాఫా అనే వ్యక్తి... ఈజిప్టు విమానాన్ని హైజాక్ చేసి.. సైప్రస్‌లోని లార్నాకలో బలవంతంగా దిపించిన సంగతి తెలిసిందే. అధికారులతో చర్చల అనంతరం తన అధీనంలో బందీలుగా ఏడుగురిని అతను  విడిచిపెట్టాడు. ఆ వెంటనే పోలీసులు అతన్ని అరెస్టు చేయడంతో ఈ హైజాక్ డ్రామా సుఖాంతమైంది. అయితే ఈ వ్యవహారంలో ఉత్కంఠభరితమైన ఉద్వేగభరితమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. లార్నాకలో విమానం ల్యాండైన తర్వాత ఓ పైలట్‌ హైజాకర్ నుంచి తప్పించుకోవడానికి చిన్నపాటి సాహసమే చేశాడు. విమానం ల్యాండైన తర్వాత అతడు కాక్‌పిట్ కిటికి నుంచి చాకచక్యంగా దూకి తప్పించుకున్నాడు. అయితే వెంటనే అధికారుల రంగ ప్రవేశంతో ఈ హైజాక్‌ డ్రామా కూడా ముగిసింది.

62 మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని హైజాక్‌ చేసిన సీఫ్..  అందులోని మహిళలు, పిల్లలను సురక్షితంగా దింపేసిన అనంతరం ఓ మహిళ సిబ్బంది ద్వారా నాలుగు పేజీల లేఖను విమానాశ్రయ అధికారులకు పంపించాడు. సైప్రస్‌లో తన మాజీ భార్యను చూసేందుకు, ఆమెతో  మాట్లాడేందుకు సీఫ్‌ ఇంతటి దుండగానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement