నేపాల్ కేబినెట్ విస్తరణపై ఈసీ అభ్యంతరాలు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారంటూ ఎన్నికల సంఘం...
సాక్షి, ఖట్మాండు: ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్‌బా చేపట్టిన మంత్రి వర్గ విస్తరణపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేలా ఆయన ఆయన వ్యవహరించారంటూ ఎన్నికల సంఘం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బహదూర్ స్పందించారు.
ఎన్నికల సంఘం ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అతికష్టం మీద ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్నాకే విస్తరణ చేపట్టాం. దానిని రద్దు చేసే అవకాశమే లేదు అని చెప్పుకొచ్చారు. నేపాల్ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొంది ప్రధాని గద్దెనెక్కిన షేర్ బహదూర్ అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు వారికి మంత్రి పదవులను ఎరగా వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మరో ముగ్గురికి ఈ మధ్యే మంత్రులుగా ప్రమోషన్ కల్పించారు.
54 మంది మంత్రులతో అతిపెద్ద కేబినెట్ ను ఏర్పాటు చేశారన్న విమర్శలు ఆయనపై వినిపిస్తున్నాయి. విరాట్‌నగర్ ప్రొవిన్స్ 2 ఎన్నికల నేపథ్యంలో ఆయన మంత్రి వర్గ పునర్వవ్యస్థీకరణ చేపట్టి ముగ్గురిని కేబినెట్‌లోకి తీసుకోగా.. దేవ్‌బా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఈసీ ఓ ప్రకటన వెలువరించింది.