కరోనా‌ అనంతరం ప్రపంచం ఇలా మారనుంది... | Sakshi
Sakshi News home page

కరోనా‌ అనంతరం ప్రపంచం ఇలా మారనుంది...

Published Wed, May 6 2020 8:24 PM

Corona: Situation Of World After Lockdown   - Sakshi

మానవాళిపై ఒక్కసారిగా దూసుకొచ్చిన కరోనా వైరస్‌ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నాం చేసింది. ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని జీవిస్తున్నారంటే దీని తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకటి కాదు రెండు యావత్‌ ప్రపంచ దేశాలు నేడు కరోనా గుప్పిట్లో చిక్కుకున్నాయి. అయితే ఎన్ని పరిశోధనలు చేసినా ఈ మహమ్మారికి ఇంకా మందు లభించకపోవడంతో ప్రస్తుతం మానవ మనుగడలో కరోనా ఓ భాగమైపోయింది. దీనికి విరుగుడు లభించే వరకు మనం దీనితోనే కలిసి జీవించాలి. కాగా ప్రస్తుతం మూత పడిన అన్ని సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌ అన్ని త్వరలోనే తిరిగి తెరుచుకునే అవకాశం ఉంది. కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా మరింత విజృంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన అనంతరం ప్రస్తుతం వివిధ దేశాల్లో కరోనా జాగ్రత్తలు ఎలా పాటిస్తున్నారో చూద్ధాం.
(మోకాలి కండరాల నొప్పి బాధిస్తోంది: అమితాబ్‌ )


1.సెలూన్‌ : లాక్‌డౌన్‌ వల్ల మహిళలు బాగా మిస్‌ అవుతోంది బ్యూటీపార్లర్లు. జపాన్‌లోని టోక్యోలో కరోనా వైరస్‌ తర్వత దీనిని వ్యాప్తిని నివారించడానికి అటు కస్టమర్లు, ఇటు షాప్‌ నిర్వహకులందరూ తప్పని సరిగా మాస్కులు ధరిస్తున్నారు. నివేదికల ప్రకారం సాధారణ సీజన్‌లో కంటే ఏప్రిల్‌లో సెలూన్ల ఆదాయం 50 శాతం కంటే ఎక్కువే పడిపోయినట్లు తేలింది. ప్రస్తుతం కరోనాకు ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తున్న వారికే సెలూన్‌లోకి అంగీకరిస్తున్నారు. (కరోనా : హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి: కేసీఆర్‌)

2.  పెళ్లి వ్యవహారాలు : స్పెయిన్‌లో ప్రస్తుతం చిన్న చిన్న వ్యాపారాలు తెరవడానికి అనుమతించచారు. ఈ క్రమంలో పెళ్లి ఏర్పాటు చేసుకున్న వధువుకు పెళ్లి దుస్తులను సరిచేయడంలో తన స్నేహితురాలు సహాయం చేస్తోంది. దీనిపై పెళ్లి కూతురు మాట్లాడుతూ.. తన వివాహం జూలైలో జరగనుందని, దానిని వాయిదా వేసే అవసరం రాదని నమ్ముతున్నట్లు తెలిపారు. అయితే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదని ఆమె అన్నారు.

3. జిమ్‌లు : సెర్భియాలో కొన్ని వ్యాపారాలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో జిమ్‌లో ప్రజలు ఇలా ముఖానికి మాస్కులు కట్టుకుని దూరం దూరంగా ఉంటూ వ్యాయామం చేస్తున్నారు.

4. రెస్టారెంట్లు : లాక్‌డౌన్‌లో రెస్టారెంట్లు అన్ని మూతపడటంతో భోజన ప్రియులు చాలానే ఇబ్బందులు ఎదుర్కున్నారు. అయితే థాయ్‌లాండ్‌లోని రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. దీంతో బ్యాంకాక్‌లోని ఓ రెస్టారెంట్‌ వాళ్లువినూత్నంగా కస్టమర్లకు ఆర్డర్లను అందిస్తున్నారు. ఒక టేబుల్‌కి మధ్యలో గాజు గ్లాస్‌ ఏర్పాటు చేసి సామాజిక దూరం పాటిస్తూ భోజనం అందిస్తున్నారు.

5. సాంస్కృతిక కార్యక్రమాలు : బ్యాంకాక్‌లో కరోనా నేపథ్యంలో మూతపడిన షాపింగ్‌ మాల్స్‌, పార్కులు, బార్‌, వైన్‌ షాప్‌లు తెరుచుకున్నాయి. దీంతో ఎరావాన్‌ మందిరంలో ప్రదర్శకులు ముఖానికి రక్షణ కవచాలు ధరించి ప్రదర్శనలు ఇస్తున్నారు. (ఈ జంట కటిఫ్‌ చెప్పేసుకున్నట్టేనా?!’ )

6. ఆసుపత్రులు : ఇక స్పెయిన్‌లోని ఆసుపత్రుల్లో పరిస్థితి అలాగే ఉంది. లాక్‌డౌన్‌ అనంతరం ఆసుపత్రికి వచ్చిన పేషెంట్‌కు చర్మవ్యాధి నిపుణుడు రోగికి మాస్కును ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే కొన్ని అవసరమైన సందర్భాలలో మాత్రం ముసుగుని తొలగించి చికిత్స ఇస్తున్నారు. ఈ విషయంపై డాక్టర్‌ మాట్లాడుతూ ఆసుపత్రిని తిరిగి తెరిచినందుకు ఆనందంగా ఉందన్నారు. (సంక్షేమ పథకాల అమలు: ఏపీలో కీలక సంస్కరణ )

Advertisement
Advertisement