ఇటు రావొద్దు.. అటు పోవొద్దు : కేసీఆర్‌ | CM KCR Holds Review Meeting On Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా : హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి: కేసీఆర్‌

May 6 2020 6:46 PM | Updated on May 6 2020 7:29 PM

CM KCR Holds Review Meeting On Coronavirus - Sakshi

చురుకైన పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఐఎఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలి

సాక్షి, హైదరాబాద్ :  కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలుకు సరిహద్దులో గల గ్రామాల్లో, గుంటూరు జిల్లాకు సరిహద్దులోని గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్ డౌన్ అమలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, ముఖ్య కార్యదర్శులు ఎస్ నర్సింగ రావు, రామకృష్ణారావు  తదితరులు పాల్గొన్నారు. 
(చదవండి : కరోనా: సింగరేణి రూ. 40 కోట్ల భారీ విరాళం )

హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. కాబట్టీ అధికారులు హైదరాబాద్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు జరిపి అవసరమైతే చికిత్స చేయించాలి. పాజిటివ్‌గా తేలితే అతన్ని కలిసిన వారందరినీ క్వారంటైన్‌కు తరలించాలి. హైదరాబాద్ లోని వారు బయటకు పోకుండా, బయటివారు హైదరాబాద్ లోనికి రాకుండా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలి. చురుకైన పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఐఎఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలి. మొత్తం హైదరాబాద్ను చుట్టుముట్టాలి. వైరస్ను తుదముట్టించాలి ” అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. (చదవండి : తెలంగాణలో పెరిగిన మద్యం రేట్లు ఇవే..)

‘పక్క రాష్ట్రంలోని కర్నూలు పట్టణం, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. వాటికి సరిహద్దుల్లోనే తెలంగాణ  గ్రామాలున్నాయి. ఈ రెండు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి నియంత్రణ చర్యలు చేపట్టాలి. అటువారెవరు ఇటు రాకుండా, ఇటువారెవరు అటు పోకుండా నియంత్రించాలి. వైరస్ మన దగ్గర పుట్టింది కాదు. ఇతర ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందేదే. కాబట్టీ ప్రజల రాకపోకలను ఎంత కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే వైరస్ వ్యాప్తిని అంత బాగా అరికట్టవచ్చు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement