యూరప్‌యేతర దేశాలకు వీసాలు రెట్టింపు

Britain to double the number of visas offered to skilled technology workers - Sakshi - Sakshi

లండన్‌: బ్రెగ్జిట్‌ అనంతర వ్యూహంలో భాగంగా బ్రిటన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో టెక్నాలజీ, కళలు, సృజనాత్మక పరిశ్రమల్లో పనిచేసే యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) దేశాలకు చెందని నిపుణులకు ప్రస్తుతం జారీచేస్తున్న వీసాలను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. అసాధారణ ప్రతిభ(ఎక్సెప్షనల్‌ టాలెంట్‌) ఉండే విదేశీయులకు టైర్‌–1 రూట్‌ ద్వారా ప్రస్తుతం 1,000 వీసాలు ఇస్తుండగా, దీన్ని 2 వేలకు పెంచుతామంది. ‘మనం ఈయూ నుంచి విడిపోతున్న సందర్భంగా బ్రిటన్‌ వ్యాపారాలకు అనుకూలంగా ఉందని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. బ్రిటన్‌లో వేగంగా దూసుకెళ్తున్న టెక్నాలజీ రంగం అభివృద్ధికి, సాంకేతికత ఫలాలు దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలందరికీ అందడానికి ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుంది’ అని ప్రధాని థెరెసా మే తెలిపారు.    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top