
వాషింగ్టన్: మొక్కల ఆధారిత జీవ ఇంధనం విమానయా న రంగంలో ఇంధనం గా వినియోగిస్తున్న పెట్రోలియం ఉత్ప త్తులకు సరైన ప్రత్యామ్నా యం అవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డా రు. మొక్కల ఆధారిత జీవ ఇంధనంపై ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు విజయవం తమైతే గనుక భవిష్యత్తులో విమానయాన రంగంలో ఇంధనంగా దీనిని వాడుకోవచ్చన్నారు. విమానయాన రంగం రోజుకు 50 లక్షల బ్యారెళ్ల ఇంధనాన్ని వాడుకుంటోంది. రోడ్డు రవాణాతోపాటు ఇళ్లు, పరిశ్రమలు ప్రత్యామ్నాయ ఇంధ నాల వైపు దృష్టి సారిస్తున్నాయి. అయితే ప్రస్తుతమున్న సాంకేతికతతో ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించడం విమానయాన రంగంలో కుదరని అంశం. దీంతో కేవలం పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎలక్ట్రిక్ విమానాలను తయారు చేయడం వంటిది అతిపెద్ద సవాలుతో కూడుకోవడంతో ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. దీంతో ద్రవీకృత జీవ ఇంధనాలే విమానయాన రంగానికి సరైన ప్రత్యామ్నాయం కానున్నాయని లారెన్స్ బర్క్‌లీ నేషనల్ ల్యాబోరేటరి పరిశోధకులు కోర్నీ స్క్వాన్ వెల్లడించారు. మొక్కల ఆధారిత జీవ ఇంధనంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.