రోజుకో ఫ్లోర్..! | Sakshi
Sakshi News home page

రోజుకో ఫ్లోర్..!

Published Mon, May 11 2015 1:14 AM

రోజుకో ఫ్లోర్..!

ఉదయం నిద్ర లేవగానే రొటీన్‌గా కాకుండా రోజుకో సీనరీ కనిపిస్తే.. వాస్తు సమస్యలు లేకుండా రోజుకో దిశలో అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ కదులుతుంటే.. ఫ్లాట్ ఏంటీ కదలడమేంటి.. ఇదంతా అసాధ్యమనుకుంటున్నారా! సాధ్యమంటూ ముందుకొచ్చాడు తైవాన్‌కు చెందిన డిజైనర్ షిన్ కువో.

అంతేకాదు దీన్ని నిరూపించేందుకు చక్రంలా తిరిగే అపార్ట్‌మెంట్ కూడా రూపొందించాడు. ఈ తిరిగే అపార్ట్‌మెంట్ కథేంటో ఓ లుక్కేద్దాం. అపార్ట్‌మెంట్‌లోని ఒక్కో ఫ్లాట్ ఒక్క యూనిట్‌గా రోలర్ కోస్టర్ మాదిరి కదులుతుంటుంది. కింద ఉన్న యూనిట్లను ఒక్కొక్కదానిని క్రేన్ల సాయంతో పైకి తీసుకెళ్తారు. ఫ్లాట్‌కు ఉన్న విద్యుత్, నీరు, గ్యాస్ కనెక్షన్లనన్నింటినీ తొలగించిన తర్వాత ఈ యూనిట్లను కదిలిస్తారు. ఇలా అన్ని ఫ్లాట్లు వాటి వంతు వచ్చినపుడు రొటేషన్ పద్ధతిలో కదులుతుంటాయి.

Advertisement
Advertisement