విమానం కూల్చివేతపై 30 మంది అరెస్ట్‌

30 Members Arrested For Ukraine Plane Crash Cause - Sakshi

టెహ్రాన్‌: ఉక్రెయిన్‌ విమానాన్ని ఇరాన్‌ కూల్చివేసిన ఘటనలో 30 మందిని అరెస్ట్‌ చేసినట్లు ఇరాన్‌ న్యాయ విభాగ అధికార ప్రతినిధి గులాం హుస్సేన్‌ ఇస్మాయిలీ తెలిపారు. మంగళవారం జరిగిన లోతైన విచారణ అనంతరం బాధ్యులైన వారిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ ప్రకటించిన కాసేపటికి గులం హుస్సేన్‌ అరెస్టు గురించి చెప్పారు. అమెరికా చర్యల వల్లనే ఈ ఘటన జరిగినప్పటికీ.. ప్రమాదాన్ని తాము సమర్థించడంలేదని రౌహానీ చెప్పారు. గతవారం టెహ్రాన్‌ నుంచి ఉక్రెయిన్‌ బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కుప్పకూలగా 176 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ పొరబాటుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top