మక్కా ఘటనలో ఇద్దరు భారతీయుల మృతి | 2 indians died in mecca crane collapsed incident | Sakshi
Sakshi News home page

మక్కా ఘటనలో ఇద్దరు భారతీయుల మృతి

Sep 12 2015 10:04 AM | Updated on Sep 3 2017 9:16 AM

మక్కా ఘటనలో ఇద్దరు భారతీయుల మృతి

మక్కా ఘటనలో ఇద్దరు భారతీయుల మృతి

ముస్లింలకు అత్యంత పవిత్రస్థలమైన చారిత్రక మక్కా మసీదులో శుక్రవారం రాత్రి జరిగిన దుర్ఘటనలో భారతీయులు ఇద్దరు మృతిచెందగా, మరో 15 మంది గాయపడినట్లు సమాచారం.

రియాద్ : ముస్లింలకు అత్యంత పవిత్రస్థలమైన చారిత్రక మక్కా మసీదులో శుక్రవారం రాత్రి జరిగిన దుర్ఘటనలో భారతీయులు ఇద్దరు మృతిచెందగా, మరో 15 మంది గాయపడినట్లు సమాచారం. మసీదు ప్రాంగణాన్ని విస్తరించే పనుల్లో వాడుతున్న భారీ క్రేన్ పైభాగం కుప్పకూలి మసీదు ప్రాంగణంలో పడటంతో 107 మంది మృతిచెందగా, మరో 184 మంది తీవ్రంగా గాయపడిన విషయం విదితమే.

పవిత్ర హజ్ యాత్ర ప్రారంభానికి కొద్దిరోజుల ముందు ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సౌదీలోని కాన్సుల్ జనరల్ మాక్కా వెళ్లి పరిస్థితి సమీక్షిస్తున్నారు. కానీ ఇప్పటిదాకా తొమ్మిది మంది గాయపడిన భారతీయులను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement