ఇరాక్ నుంచి తిరిగొస్తున్న మరో 2 వేలమంది భారతీయులు | 2,200 Indians to return from Iraq | Sakshi
Sakshi News home page

ఇరాక్ నుంచి తిరిగొస్తున్న మరో 2 వేలమంది భారతీయులు

Jul 6 2014 8:10 PM | Updated on Sep 2 2017 9:54 AM

ఇరాక్లోని కల్లోలిత ప్రాంతాల్లో ఉంటున్న దాదాపు 2200 మంది భారతీయులు స్వదేశానికి తిరిగివస్తున్నారు.

న్యూఢిల్లీ: ఇరాక్లోని కల్లోలిత ప్రాంతాల్లో ఉంటున్న దాదాపు 2200 మంది భారతీయులు స్వదేశానికి తిరిగివస్తున్నారు. 1600 మందికి భారత ప్రభుత్వం విమాన టిక్కెట్ల కొనుగోలు చేయగా, మరో 600 మందికి వారు ఇరాక్లో పనిచేస్తున్న కంపెనీలు టిక్కెట్ల డబ్బులు చెల్లించాయి.

ఆదివారం రాత్రికి 117 మంది ఢిల్లీ చేరుకోనున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు తెలియజేసింది. ఇరాక్లో ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న నర్సులను భారత్కు క్షేమంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని స్వస్థలాలకు పంపారు. ఇరాక్లో ఉగ్రవాదులు చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. దీంతో అక్కడ భారతీయులకు రక్షణ లేకుండాపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement