సిరలకు, గుండెకు మధ్య ‘కృత్రిమ గుండె’! | సిరలకు, గుండెకు మధ్య ‘కృత్రిమ గుండె’! | Sakshi
Sakshi News home page

సిరలకు, గుండెకు మధ్య ‘కృత్రిమ గుండె’!

Mar 31 2014 4:06 AM | Updated on Sep 2 2017 5:22 AM

సిరలకు, గుండెకు మధ్య ‘కృత్రిమ గుండె’!

సిరలకు, గుండెకు మధ్య ‘కృత్రిమ గుండె’!

గుండెకు రక్తాన్ని తీసుకొచ్చే సిరలకు గుండె వద్ద కవాటాలుంటాయి. అవి లేకపోతే రక్త ప్రసరణలో ఇబ్బందులు తప్పవు. అయితే ఈ సమస్యకు జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరీన్ సర్వజ్ఞన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఓ చక్కని పరిష్కారం కనుగొన్నారు.

వాషింగ్టన్: గుండెకు రక్తాన్ని తీసుకొచ్చే సిరలకు గుండె వద్ద కవాటాలుంటాయి. అవి లేకపోతే రక్త ప్రసరణలో ఇబ్బందులు తప్పవు. అయితే ఈ సమస్యకు జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరీన్ సర్వజ్ఞన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఓ చక్కని పరిష్కారం కనుగొన్నారు. సిరల నుంచి రక్తాన్ని తీసుకుని గుండెలోకి ప్రవేశపెట్టే సరికొత్త మినీ గుండెను వారు మూలకణాలతో రూపొందించారు.
 
  గుండె సంకోచ, వ్యాకోచాలకు అనుగుణంగా లయబద్ధంగా సంకోచించే ఈ మినీ గుండెను రోగి మూలకణాలతోనే తయారు చే శారు గనక.. దానిని రోగి శరీరం తిరస్కరించే ప్రమాదమూ ఉండదు. దెబ్బతిన్న అవయవాలను బాగుచేయడమే కాదు.. ఇలాంటి ప్రత్యేక అవయవాలను కూడా మూలకణాలతో తయారు చేయవచ్చని తాము నిరూపించామని సర్వజ్ఞన్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement