గొప్ప మానవతావాది | Ysrcp tribute to jagjivanram | Sakshi
Sakshi News home page

గొప్ప మానవతావాది

Apr 6 2016 12:47 AM | Updated on Aug 14 2018 11:26 AM

గొప్ప మానవతావాది - Sakshi

గొప్ప మానవతావాది

బాబూ జగ్జీవన్‌రామ్ గొప్ప మానవతావాదనీ, ఆయన ఆదర్శాలు, ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్నపుడే నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని వైఎస్సార్‌సీపీ

జగ్జీవన్‌రామ్‌కు వైఎస్సార్‌సీపీ నివాళి
 
 సాక్షి, హైదరాబాద్: బాబూ జగ్జీవన్‌రామ్ గొప్ప మానవతావాదనీ, ఆయన ఆదర్శాలు, ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్నపుడే నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు ఉప్పులేటి కల్పన అన్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పలువురు పాల్గొని జగ్జీవన్‌రామ్‌కు నివాళి ఘటించారు.ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ జగ్జీవన్ సేవలను శ్లాఘిం చారు.

శాసనమండలిలో వైఎస్సార్‌సీపీపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్‌లు సమాజంలోని అట్టడుగువర్గాలందరి సంక్షేమానికి పాటుపడ్డారన్నారు.ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ఇటీవల దళితుల్ని కించపర్చేలా వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు.. జగ్జీవన్‌రామ్ జయంతి రోజున  ఎస్సీల పాదాలు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.పార్టీ ఎస్సీ ఏపీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ తెలంగాణ ఎస్సీ విభాగం అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్‌లు కూడా ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement