విషమంగానే విద్యాసాగర్‌రావు ఆరోగ్యం | Vidyasagar rao health is still critical | Sakshi
Sakshi News home page

విషమంగానే విద్యాసాగర్‌రావు ఆరోగ్యం

Apr 24 2017 2:47 AM | Updated on Mar 19 2019 9:20 PM

విషమంగానే విద్యాసాగర్‌రావు ఆరోగ్యం - Sakshi

విషమంగానే విద్యాసాగర్‌రావు ఆరోగ్యం

తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు ఆర్‌.విద్యాసాగర్‌రావు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు ఆర్‌.విద్యాసాగర్‌రావు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయనకు వెంటి లేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. కొంతకాలంగా ఆయన బ్లాడర్‌ కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.

ఆదివారం మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌ రెడ్డిలు వేర్వేరుగా ఆస్పత్రిని సందర్శించి విద్యాసాగర్‌రావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ఎంపీ బీబీ పాటిల్, శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషి, ఇతర ఇంజనీర్లు ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement