రాజేంద్ర నగర్ నార్సింగ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఇంజినీర్లు దుర్మరణం చెందారు.
హైదరాబాద్ : రాజేంద్ర నగర్ నార్సింగ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఇంజినీర్లు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొనటంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులు 'విప్రో'లో సాప్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న అరుణ్, యాదవ్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.