గాయనిగా 'నాయకి' | Trisha turns singer for Nayaki | Sakshi
Sakshi News home page

గాయనిగా 'నాయకి'

Aug 23 2015 9:09 AM | Updated on Sep 3 2017 8:00 AM

గాయనిగా 'నాయకి'

గాయనిగా 'నాయకి'

హీరోయిన్ త్రిష తన గొంతు సవరించుకోనుంది.

హైదరాబాద్: హీరోయిన్ త్రిష తన గొంతు సవరించుకోనుంది. తాజాగా ఆమె నటిస్తున్న 'నాయకి' చిత్రంలో ఓ పాట పాడనుంది. ఈ మేరకు ఆ చిత్ర దర్శకుడు గోవి ఆదివారం హైదరాబాద్లో వెల్లడించారు. చిత్రం ప్రారంభమైన వెంటనే టైటిల్స్ పడుతున్నప్పుడు ఆమె పాడిన ఈ గీతం వినపడుతుందని తెలిపారు. ఈ పాటకు త్రిషా గొంతు ఖచ్చితంగా సరిపోతుందని నాయకి సంగీత దర్శకుడు రఘు కుంచె అభిప్రాయపడ్డారని చెప్పారు.

దాంతో వెంటనే త్రిషను కలసి వివరించామని చెప్పారు. దాంతో ఆమె వెంటనే అంగీకరించారన్నారు. 1980 నాటి కథాంశంతో హరర్, కామెడీ బ్యాక్డ్రాప్తో నాయకి తెరకెక్కిస్తున్నామని తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఆక్టోబర్ నాటికి పూర్త అవుతుందని గోవి చెప్పారు. గోవి దర్శకత్వంలో లవ్ యు బంగారం చిత్రం ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement