తెలంగాణ టెట్ ఫలితాలు నేడు విడుదల.
*తెలంగాణ టెట్ ఫలితాలు నేడు విడుదల. ఈ ఫలితాలను ఉదయం 11.00 గంటలకు మంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు.
*న్యూఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంలో నేడు పొలిట్ బ్యూరో సమావేశం. 18,19,20 తేదీల్లో కేంద్ర కమిటీ సమావేశాలు. ఇటీవల ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు,వాటి ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే దేశంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరగనుంది.
*హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీపై ఉ.10.00 గం.లకు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు ఈడీ, ఆర్ఎం, డీఎంలు హాజరుకానున్నారు.
* నేడు హైదరాబాద్ లో కంటోన్మెంట్ ఆసుపత్రిని ప్రారంభించనున్న రక్షణ మంత్రి పారికర్. శనివారం దిండిగల్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో పారికర్ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు.
*తెలంగాణలో నేడు జేఏసీ బస్సు యాత్ర, మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో పర్యటించనున్న జేఏసీ నేతలు
* తిరుమలలో నేటి నుంచి శ్రీవారి జ్యేష్టాభిషేకం : 3 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు