అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

Published Mon, Feb 22 2016 4:22 AM

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం - Sakshi

హైదరాబాద్: అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెం దాడు. దీంతో హైదరాబాద్ నాచారంలోని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు విచారంలో మునిగిపోయారు. నాచారంలోని సాయిదుర్గా అపార్ట్‌మెంట్‌కు చెందిన సీఏ మోజెస్, శివారాణి దంపతుల కుమారుడు నోయల్ మాథ్యూస్ (24) అమెరికాలోని ట్రాయ్ యూనివ ర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు.

మాథ్యూస్ తన స్నేహితులతో కలసి శనివారం ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగొస్తుండగా ఆదివారం ఉదయం అలబామా ప్రాంతం లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాథ్యూస్ అక్కడిక్కడే మృతి చెందారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరుకు చెందిన భరత్, వంశీలు తీవ్రంగా గాయపడ్డారని, నిఖిల్, యశ్వంత్‌లకు స్వల్ప గాయాలయ్యాయని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement