కేసీఆర్పై టీడీపీ ఎంపీ పొగడ్తల వర్షం | tdp mp mallareddy Praise telangana cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్పై టీడీపీ ఎంపీ పొగడ్తల వర్షం

Jun 5 2015 1:21 PM | Updated on Aug 15 2018 9:27 PM

కేసీఆర్పై టీడీపీ ఎంపీ పొగడ్తల వర్షం - Sakshi

కేసీఆర్పై టీడీపీ ఎంపీ పొగడ్తల వర్షం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు.  కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ఆయన ప్రశంసించారు. మల్కాజ్గిరిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ లాంటి సీఎం ఉండటం మన అదృష్టమన్నారు.

 

రాష్ట్ర విభజన అనంతరం మంచి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారన్నారు. మల్కాజ్గిరి ప్రాంతానికి ఆయన వందల కోట్లు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో 3,300 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement