చంచల్‌గూడకు భానుకిరణ్ | sending-bhanu-kiran-to-chanchalguda-jail | Sakshi
Sakshi News home page

చంచల్‌గూడకు భానుకిరణ్

Jul 2 2016 1:38 PM | Updated on Jul 28 2018 6:26 PM

మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్యకేసులో నిందితుడైన భానుకిరణ్‌ను చర్లపల్లి జైలు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

హైదరాబాద్: మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్యకేసులో నిందితుడైన భానుకిరణ్‌ను చర్లపల్లి జైలు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సూరి హత్య కేసులో అరెస్ట్‌ అయిన తరువాత భానుకిరణ్‌ నాలుగేళ్ళుగా చర్లపల్లి జైలులోనే ఉంటున్నాడు. అయితే జైలు కేంద్రంగా భాను పలు అక్రమాలకు పాల్పడుతున్నాడు. దీంతో అతనిని చంచల్ గూడ జైలుకు తరలించడానికి అనుమతి ఇవ్వాలని జైలు అధికారులు నాంపల్లి కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అనుమతించడంతో ఈ రోజు మధ్యాహ్నం భానుకిరణ్ ను చంచల్ గూడకు తరలించారు. మరో వైపు భానుకు ప్రాణహాని ఉండటంతో ప్రత్యేక బ్యారక్ ను జైలు అధికారులు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement