'బౌద్ధం బలంగా ఉన్న దేశాల్లో ఆర్థిక వృద్ధి బాగుంది' | sakshi editorial director on budhas statement | Sakshi
Sakshi News home page

'బౌద్ధం బలంగా ఉన్న దేశాల్లో ఆర్థిక వృద్ధి బాగుంది'

May 8 2015 11:17 PM | Updated on Sep 3 2017 1:40 AM

బౌద్ధం బలంగా ఉన్న దేశాల్లో ఆర్ధికపురోగాభివృద్ధి బాగుందని 'సాక్షి' దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్ర మూర్తి అన్నారు.

హైదరాబాద్: బౌద్ధం బలంగా ఉన్న దేశాల్లో ఆర్ధికపురోగాభివృద్ధి బాగుందని 'సాక్షి' దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్ర మూర్తి అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐ రచయత డాక్టర్ కొల్లూరు వెంకట సుబ్బారావు రచించిన ‘ప్రాఫెట్స్ అండ్ ప్రాఫిట్స్ ఆర్కిటెక్స్ ఆఫ్ న్యూ ఇండియా’ అనే పుస్తక పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చిన రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. పుస్తకాన్ని చదివానని భారతదేశం పట్ల, ఇక్కడి ప్రజలపట్ల రచయతకు విశాల దృక్పథం ఉందని తెలిపారు.

బుధ్దుడు, కృష్ణుడు, చాణిక్యుడు చేసిన ఉపదేశాలు ఆదర్శంగా తీసుకుంటే మనం అనుకున్న విజన్ 20 - 20 అభివృద్ధి సాధించుకోవచ్చునని అన్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామ్య ఆర్ధిక వ్యవస్థగా ఎదగాలని సూచించారు. తూర్పున అనేక దేశాలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాయని వాటిని ఏషియన్ టైగర్స్ అంటారని బౌద్ధ మతం బలంగా ఉన్నదేశాల్లో అభివృద్ధి బాగుందని అందుకే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎన్నుకున్నారని అన్నారు.
(పంజగుట్ట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement