సైదాబాద్‌లో చోరీ | robbery in saidabad | Sakshi
Sakshi News home page

సైదాబాద్‌లో చోరీ

May 12 2016 11:53 AM | Updated on Aug 30 2018 5:27 PM

సైదాబాద్ పరిధిలోని ఓ అపార్టుమెంటులో బుధవారం రాత్రి చోరీ జరిగింది.

హైదరాబాద్‌ : సైదాబాద్ పరిధిలోని ఓ అపార్టుమెంటులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. దుండగులు ఇంటి తలుపు గొళ్లెం తొలగించి లోపలికి ప్రవేశించారు. ఇంటిలో దాచిన 4 తులాల బంగారం, రూ.45 వేల నగదు, ఒక కెమెరా దొంగిలించారు. ఆ విషయాన్ని గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి... పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా దొంగతనం జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement