దర్శకుడు పూరీజగన్నాథ్ ఇంట్లో చోరీ | robbery in director puri jagannath house | Sakshi
Sakshi News home page

దర్శకుడు పూరీజగన్నాథ్ ఇంట్లో చోరీ

Mar 14 2015 1:46 AM | Updated on Mar 22 2019 1:53 PM

దర్శకుడు పూరీజగన్నాథ్ ఇంట్లో చోరీ - Sakshi

దర్శకుడు పూరీజగన్నాథ్ ఇంట్లో చోరీ

టాలీవుడ్ డెరైక్టర్ పూరీ జగన్నాథ్ ఇంట్లో శుక్రవారం భారీ చోరీ జరిగింది.

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ నివాసంలో భారీ చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 31లో నివసించే పూరి జగన్నాథ్ కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బెడ్‌రూమ్‌లో ఉన్న అలమరా తాళాలు తీసి బంగారు ఆభరణాలు తస్కరించారు.

ఈ మేరకు ఆయన శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలమరాలోని సుమారు రూ.15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, అరుదైన డిజైన్లు, వజ్రాలు పొదిగిన నెక్లెస్ ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement