తెలంగాణలో 4 కోట్ల మంది పాలన | Regime of 4 million in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 4 కోట్ల మంది పాలన

Mar 5 2017 3:21 AM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణలో 4 కోట్ల మంది పాలన - Sakshi

తెలంగాణలో 4 కోట్ల మంది పాలన

రాష్ట్రంలో నలుగురి పాలనే నడుస్తోందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత దిగ్విజయ్‌సింగ్‌ చేసిన విమర్శలపై టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ మండిపడ్డారు.

దిగ్విజయ్‌ ‘నలుగురి పాలన’ వ్యాఖ్యలపై ఎంపీ వినోద్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నలుగురి పాలనే నడుస్తోందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత దిగ్విజయ్‌సింగ్‌ చేసిన విమర్శలపై టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ మండిపడ్డారు. తెలంగాణలో నడుస్తున్నది నలుగురి పాలన కాదని.. నాలుగు కోట్ల మంది పాలన అని పేర్కొన్నారు. ప్రజలంతా ఈ ప్రభుత్వం తమ దని భావిస్తున్నారని చెప్పారు.

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవమున్న దిగ్విజయ్‌ ఈ విషయంలో కనీసపరిజ్ఞానం లేకుండా మాట్లాడటం శోచనీ యమని వ్యాఖ్యా నించారు. కేసీఆర్‌ పాలన బాగుండబట్టే ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ లో తెలంగాణకు మొదటి ర్యాంక్‌ వచ్చిం దన్నారు. శనివారం ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలసి వినోద్‌ విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement