కేబీఆర్ పార్క్లో రకుల్, రాశీ ఖన్నా ఏంచేశారు? | rakul preeth singh, rasi khanna planted trees | Sakshi
Sakshi News home page

కేబీఆర్ పార్క్లో రకుల్, రాశీ ఖన్నా ఏంచేశారు?

Jul 10 2016 10:56 AM | Updated on Jul 23 2019 11:50 AM

కేబీఆర్ పార్క్లో రకుల్, రాశీ ఖన్నా ఏంచేశారు? - Sakshi

కేబీఆర్ పార్క్లో రకుల్, రాశీ ఖన్నా ఏంచేశారు?

వెండితెరపైనే కాదు.. సామాజిక స్పృహ విషయంలో కూడా తామేం తక్కువ కాదని నిరూపించారు మన తెలుగు సినిమా ముద్దుగుమ్మలు.

హైదరాబాద్: వెండితెరపైనే కాదు.. సామాజిక స్పృహ విషయంలో కూడా తామేం తక్కువ కాదని నిరూపించారు మన తెలుగు సినిమా ముద్దుగుమ్మలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండో దఫా హరితహారంలో వారు భాగస్వామ్యం అయ్యారు. కేబీఆర్ పార్క్లో ఆదివారం ఉదయం మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రముఖ తెలుగు నటీ మణులు రకూల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా పాల్గొన్నారు.

తమవంతుగా మొక్కలు నాటి స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ను వారు ప్రశంసల్లో ముంచెత్తారు. హైదరాబాద్ ఇప్పటికే మంచి గ్రీన్ సిటీ అని, ఎకోనగరంగా మారేందుకు అందరం తోడ్పడాలని అన్నారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించడం శుభపరిణామం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement