ముగ్గురితో రొమాన్స్.. ఫుల్ కామెడీగా ట్రైలర్ | Actress Rakul Preet Singh PATI PATNI AUR WOH DO Movie Trailer, Watch Video And Highlights Inside | Sakshi
Sakshi News home page

PATI PATNI AUR WOH DO Trailer: ముగ్గురితో రొమాన్స్.. ఫుల్ కామెడీగా ట్రైలర్

May 3 2026 12:16 PM | Updated on May 3 2026 2:08 PM

Rakul Preet Singh Movie PATI PATNI AUR WOH DO Trailer

రకుల్ ప్రీత్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో వస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ పతి పత్నీ ఔర్‌ వో దో. ఈ సినిమాకు ముదస్సర్‌ అజీజ్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సారా అలీ ఖాన్, వామికా గబ్బీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రైలర్ చూస్తుంటే పెళ్లి తర్వాత మరో ఇ‍ద్దరు అమ్మాయిలతో రిలేషన్‌ నేపథ్యంలో కథ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. భార్య, ఇద్దరు అమ్మాయిలను ఎలా డీల్ చేశాడన్నదే పతి పత్నీ ఔర్‌ వో దో. ట్రైలర్‌లో సన్నివేశాలు చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా కథ ఉండనుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ప్రజాపతి పాండే పాత్రలో  ఆయుష్మాన్‌ కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement